Bigg boss 7 : కాలుతో తన్నాడు.. నేలకేసి కొట్టాడు.. ఎందుకంత అతి
ABN, First Publish Date - 2023-09-07T14:44:56+05:30
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన మూడో రోజునే ఎవరి ఓవరాక్షన్ వాళ్లు ప్రదర్శిస్తున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో ఆయన చెప్పిందే వేదం. బాస్ ఇచ్చిన టార్గెట్‌ను చేసి చూపించాల్సిందే. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే అంతే మరి. బిగ్‌బాస్‌కే ఎదురు తిరిగి మాట్లాడటం, అతి చేయడం బిగ్‌బాస్‌లాంటివి నిషేదం దానిని బిగ్‌బాస్ కూడా సహించరు.
బిగ్‌బాస్ హౌస్‌లో (biggboss7) అడుగుపెట్టిన మూడో రోజునే ఎవరి ఓవరాక్షన్ వాళ్లు ప్రదర్శిస్తున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో ఆయన చెప్పిందే వేదం. బాస్ ఇచ్చిన టార్గెట్‌ను చేసి చూపించాల్సిందే. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే అంతే మరి. బిగ్‌బాస్‌కే ఎదురు తిరిగి మాట్లాడటం, అతి చేయడం బిగ్‌బాస్‌లాంటివి నిషేదం దానిని బిగ్‌బాస్ కూడా సహించరు. అయితే ఈ విషయంలో నటుడే శివాజీ లిమిట్ క్రాస్ చేశాడు. తాజాగా విడుదల చేసిన ప్రొమోలో ఈ విషయాన్ని చూపించారు. (Shivaji fire)
హౌస్‌లో కాఫీ పౌడర్ లేదని, బిగ్‌బాస్ పంపలేదని శివాజీ ఫ్రస్టేట్ అయ్యాడు. ఆవేశంతో చేతిలో ఉన్న గ్లాస్‌ను నేలకేసి కొట్టాడ. బకెట్‌ను కాలితో తన్నాడు. మరో గంట చూస్తా.. ఎవరికీ భయపడను అంటూ కాసేపు హడావిడి చేశాడు. అయినా బిగ్‌బాస్ అతన్ని ఏమీ అనకుండా కూల్ చేసే ప్రయత్నం చేశాడు. గౌతమ్‌కు బీపీ మెషిన్ ఇచ్చి శివాజీ బీపీ ఎంతుందో చూడమన్నాడు. అయినా సరే, శివాజీ యాటిట్యూడ్ చూపిస్తూ ఏం బీపీ చూస్తవ్.. పెట్టక్కడ అంటూ గౌతమ్ మీదా అరిచాడు. నీకే బీపీ ఎక్కువైందని బిగ్‌బాస్‌నే తిట్టిపోశాడు. తలుపుతు తీస్తే మరుక్షణం వెళ్లిపోతానంటూ హడావిడి చేశాడు. పరిస్థితిని కూల్ చేయాలని రతికకు ఓ చిన్న పని అప్పజెప్పాడు. స్టెతస్కోప్ తీసుకుని అందరి గుండె ఏం చెప్తుందో తెలియజేయాలన్నాడు బాస్. కానీ శివాజీ ఆ పని కూడా చేయనివ్వలేదు. నేను ఇక్కడ బాధపడుతుంటే బిగ్‌బాస్‌కు కామెడీగా ఉందా? అందరి హార్ట్ బీట్ చూసి ఈ శివాజీగాడిది వదిలేసి నన్ను పిచ్చోడిని చేయాలనుకుంటున్నాడా? నాకు ఈ బిగ్‌బాస్ హౌసే వద్దు, తలుపులు తీస్తే వెళ్లిపోతా.. అంటూ మండిపడ్డాడు.
హౌస్‌లో అడుగుపెట్టిన రోజు 30 లక్షలు ఆఫర్ చేస్తే తిరస్కరించి.. నేనొక కొత్త లోకం చూడాలనుకుంటున్నా.. ఈ ఇంట్లో ఆట ఆడాలనుకుంటున్నా’ అని చెప్పిన శివాజీ ఎందుకు ఇంతగా ఫైర్ అయ్యాడో అర్థం కావట్లేదు అంటున్నారు నెటిజన్లు. కాఫీ కోసం ఇంద రాద్దాంతమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది సీక్రెట్ టాస్క్‌లో భాగం అయితే ఓకే. కానీ ఇంత ఓవరాక్షన్ పనికిరాదు అని విమర్శిస్తున్నారు.