సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#Dhamaka: సారీ చెప్పిన షకలక శంకర్

ABN, First Publish Date - 2023-01-03T11:27:01+05:30

సాంఘీక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా జబర్దస్త్ నటుడు షకలక శంకర్ (Shakalaka Shankar is trolling on social media) మీద రవితేజ (Ravi Teja fans trolling Shankar) అభిమానులు ఫైర్ అవుతూ వున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంఘీక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా జబర్దస్త్ నటుడు షకలక శంకర్ (Shakalaka Shankar is trolling on social media) మీద రవితేజ (Ravi Teja fans trolling Shankar) అభిమానులు ఫైర్ అవుతూ వున్నారు. షకలక శంకర్ మీద #Saysorryshakalaka అన్న హాష్ టాగ్ (Hash tag) తో రవితేజ అభిమానులు అతనితో సారీ (saree) చెప్పేంత వరకు అతన్ని ఒక ఆట ఆదుకున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే, 'ధమాకా' (Dhamaka Success meet) విజయ సదస్సులో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) రవితేజ గురించి మాట్లాడుతూ ఈమధ్య కొంతమంది నటులు రెండు, మూడేళ్లకే సూపర్ స్టార్, మెగాస్టార్ లో అయిపోతున్నారని అంటూ, రవితేజ అలా కాదు అని, చాలా కష్టపడి పైకి వచ్చాడని చెప్పాడు.

బండ్ల గణేష్ వ్యాఖ్యలకి షకలక శంకర్ తనదయిన స్టైల్ లో కొంచెం ఘాటుగానే స్పందించాడు. మెగాస్టార్, సూపర్ స్టార్ ఆలా వూరికే అయిపోరని, కష్ట పడితే అవుతారని అంటూ, ఎవడో హీరో నీ ముందు ఉంటే, నువ్వు వెనకా ముందూ చూసుకోకుండా, మైక్ నీ చేతిలో ఉందని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని బండ్ల గణేష్ కి శంకర్ కౌంటర్ ఇచ్చాడు. అయితే శంకర్ ఫ్లో లో 'ఎవడో' హీరో అని ఇక వచనం తో సంభోదించటం రవితేజ అభిమానులకు నచ్చలేదు. దానితో అభిమానులు శంకర్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. దీనితో శంకర్ తాను ఆలా ఫ్లో లో చెప్పేసాను అని, చిరంజీవి ని ఎంత అభిమానిస్తానో రవి తేజ ని కూడా అంతే అభిమానిస్తాని చెప్పుకొస్తూ, ఏమైనా అంటే క్షమించమని రవి తేజ కి చెప్పాడు. ఆలా ఒక వీడియో కూడా విడుదల చేసాడు. (#ShakalakaShankar says sorry to Ravi Teja) దీనితో రవి తేజ అభిమానులు శాంతించారు.

Updated Date - 2023-01-03T11:27:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!