SarathBabu: మరింత విషమించిన శరత్ బాబు ఆరోగ్యం, వెంటిలేటర్ మీదనే...
ABN, First Publish Date - 2023-04-24T15:43:02+05:30
శరత్ బాబు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వారిని ఎటువంటి అధికారిక ప్రకటన శరత్ బాబు ఆరోగ్యానికి సంబంధించి బయటకి చెప్పవద్దని స్ట్రిక్ట్ గా చెప్పారని తెలిసింది. అందువల్ల అతని ఆరోగ్య ప్రకటనలు ఆసుపత్రి వర్గాలు ఇవ్వటం లేదని కూడా తెలిసింది. ఇంతకీ అతని ఆరోగ్యం ఎలా ఉందంటే..
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవటం వలన ఆరోగ్య పరిస్థితి మరికొంచెం క్షీణించింది అని తెలుస్తోంది. ఈనెల 20వ తేదీన, బెంగుళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి ఏ.ఐ.జి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే శరత్ బాబు కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యానికి శరత్ బాబు ఆరోగ్యం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనవసరం లేదని చెప్పారని తెలిసింది.
అలాగే శరత్ బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా వుంది అన్న విషయం కూడా బయటకి ఎవరికీ చెప్పొద్దు అని కూడా శరత్ బాబు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వర్గాలని కోరినట్టుగా తెలిసింది. అయితే శరత్ బాబు ఆరోగ్యం విషయం లో ఎటువంటి మార్పు లేదని, అతను ఇంకా వెంటిలేటర్ మీదే వున్నాడని తెలుస్తోంది.
శరత్ బాబు 1973 వ సంవత్సరం లో 'రామ రాజ్యం' అనే సినిమాతో పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసాడు. అతను సినిమా రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో నుండి కొన్నేళ్లు కాపురం చేశారు. ఎందుకంటే అతని తరువాత రమాప్రభ ని పెళ్లిచేసుకోలేదు అని వివరించారు. తరువాత తమిళ్ నాడులో ప్రముఖ నటుడు అయిన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేసాక, 2011 సంవత్సరంలో విడిపోయారు.
71 సంవత్సరాల శరత్ బాబు ఆ తరువాత ఒక్కడే చెన్నై లో నివాసం ఉంటున్నాడు. అతని అసలు పేరు సత్యబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతను తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబు కి, అగ్ర నటులు అయిన కమల్ హాసన్ (Kamal Haasan), రజినీకాంత్ (Rajinikanth), శరత్ కుమార్ (Sarath Kumar), శివాజీ గణేశన్ (Sivaji Ganeshan) లాంటి వీరందరితో మంచి పరిచయాలు వున్నాయి.