సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Selva Raghavan: సోనియాతో విడాకులు.. తమ్ముడు ధనుష్‌ ఏం చెప్పాడో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-04T14:27:53+05:30

ఏ సినిమా ఇండస్ర్టీలో ప్రేమలో పడటం, పెళ్లిళ్లు జరగడం ఎంత వేగంగా జరుగుతాయో విడాకులు కూడా అలాగే జరుగుతుంటాయి. ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఉత్తమ జంట అనిపించుకున్నవారే విడాకులు తీసుకుని షాక్‌ ఇచ్చిన సందర్భాలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ సినిమా ఇండస్ర్టీలో ప్రేమలో పడటం, పెళ్లిళ్లు జరగడం ఎంత వేగంగా జరుగుతాయో విడాకులు కూడా అలాగే జరుగుతుంటాయి. ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఉత్తమ జంట అనిపించుకున్నవారే విడాకులు తీసుకుని షాక్‌ ఇచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ (Selva Raghavan)- సోనియా అగర్వాల్‌ (Sonia Agarwal) జంట ఒకటి. ‘7/G బృందావన్‌ కాలనీ’ 7/G brundavan colony) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సోనియా అగర్వాల్‌.

ఆ సినిమా సమయంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా 2006లో ఆమె సెల్వను పెళ్లాడింది. నాలుగేళ్లు సరదాగా సాగిన వీరి జీవితానికి 2010లో బ్రేక్‌ పడింది. వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఈ విషయం గురించి సెల్వ రాఘవన్‌ ఇటీవల ఓ తమిళ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మేమిద్దరం మనస్పర్ధల వల్ల విడిపోయాం. ఆ సమయంలో నా తమ్ముడు ధనుష్‌ (Dhanush advice to Selva raghavan) ఓ మాట చెప్పాడు. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడు. నీకు దేవుడు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు’ అని చెప్పాడు. విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. 2011లో గీతాంజలి రామన్‌ను పెళ్లి చేసుకున్నా. ఆమె రాకతో నా జీవితంలో ఊహించని మార్పులొచ్చాయి. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని చెప్పారు. సోనియా మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు సింగిల్‌గా ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె ప్రత్యేక గీతాలతో కూడా కనువిందు చేస్తోంది. (Selva raghavan Divorce with Selva raghavan)

Updated Date - 2023-03-04T14:27:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!