కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tv Movies: శనివారం.. టీవీల్లో వచ్చే సినిమాలివే

ABN, First Publish Date - 2023-11-24T20:42:32+05:30

శనివారం (25.11.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో క‌లిపి దాదాపు 40 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

TV

శనివారం (25.11.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో క‌లిపి దాదాపు 40 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో ఉద‌యం 8.30గంట‌లకు పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్, మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు కల్యాణ్ రామ్ న‌టించిన అమిగోస్ ప్ర‌సారం కానున్నాయి.

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్, లక్ష్మీరాయ్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ టెలీకాస్ట్ కానుంది.

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో ఉద‌యం 7గంట‌లకు నారా రోహిత్,సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయ నటించిన వీరభోగ వసంతరాయలు, ఉద‌యం 10 గంట‌లకు లిటిల్ సోల్జర్స్, మ‌ధ్యాహ్నం 1 గంటకు గోపీచంద్, మెహరీన్ నటించిన పంతం, సాయంత్రం 4 గంట‌లకు నాని, సుధీర్ బాబు నటించిన V, రాత్రి 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ, మీనా,రోజా నటించిన బొబ్బిలి సింహం, రాత్రి 10 గంట‌లకు ప్రభుదేవా, నగ్మ నటించిన ప్రేమికుడు వంటి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

ఇక జీ(Zee) తెలుగులో ఉద‌యం 9 గంట‌లకు నాగార్జున, నాగ చైతన్య, క్రతి శెట్టి నటించిన బంగార్రాజు సినిమా ప్ర‌సారం కానుంది.

జీ(Zee) సినిమాలులో ఉద‌యం 7 గంట‌లకు ఐశ్వర్యరాజేశ్ నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ఉద‌యం 9.00 గంట‌లకు నితిన్, కీర్తి సురేశ్ నటించిన రంగ్ దే, మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ చరణ్, రకుల్ ప్రీత్ నటించిన బ్రూస్ లీ, మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్, సాయంత్రం 6 గంట‌లకు సందీప్ కిషన్,దివ్యాంశ కౌశిక్ నటించిన మైఖెల్, రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన దువ్వాడ జగన్నాథం ప్ర‌సారం కానున్నాయి.


ఈ టీవీ(E TV)లో ఉద‌యం 9 గంట‌లకు లరుణ్,రిచా నటించిన నువ్వే కావాలి, ఈ టీవీ ప్ల‌స్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జగపతిబాబు, రాశి నటించిన పెళ్లి పందిరి, రాత్రి 10 గంట‌లకు బాల కృష్ణ, విజయశాంతి నటించిన ముద్దుల మేనల్లుడు సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి.

ఈ టీవీ(E TV) సినిమాలో ఉద‌యం 7గంట‌లకు మోహన్బాబు, రమ్యకృష్ణ న‌టించిన అల్లుడుగారు, ఉద‌యం 10గంట‌ల‌కు ఎస్వీ రంగారావు, కృష్ణ న‌టించిన బందిపోటు భీమన్న, మ‌ధ్యాహ్నం 1 గంటకు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చక్రధారి, సాయంత్రం 4 గంట‌లకు కృష్ణ నటించిన తేనె మనషులు, రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు, అంజలీదేవి నటించిన వారసత్వం సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

మా(Maa TV)టీవీలో ఉద‌యం 9 గంట‌లకు యశ్ నటించిన KGF1 ప్రసారం కానుంది.

మా(Maa Gold) గోల్డ్‌లో ఉద‌యం 6.30 గంట‌లకు సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే, ఉద‌యం 8 గంట‌లకు అజిత్, త్రిష, అనుష్కలు నటించిన ఎంతవాడు గానీ, ఉద‌యం 11గంట‌లకు మళయాళ డబ్బింగ్ చిత్రం మెఖెల్, మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శివరాజ్ కుమార్ నటించిన భజరంగి, సాయంత్రం 5 గంట‌లకు జూ.ఎన్టీఆర్,నయనతార నటించిన అదుర్స్ , రాత్రి 8 గంట‌లకు సూర్య, తమన్నా నటించిన వీడొక్కడే , తిరిగి రాత్రి 11గంట‌ల‌కు అజిత్, త్రిష, అనుష్క నటించిన ఎంతవాడు గానీ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

స్టార్ మా( (Maa HD) హెచ్డీలో ఉద‌యం 7 గంట‌లకు జ్యోతిక, రేవతి నటించిన జాక్ పాట్, ఉద‌యం 9 గంట‌లకు నాని, లావణ్య త్రిపాఠి నటించిన భలే భలే మొగాడివోయ్, మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్రభాస్, అనుష్క నటించిన మిర్చి, మధ్యాహ్నం 3 గంట‌లకు సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ, సాయంత్రం 6 గంట‌లకు రవితేజ నటించిన క్రాక్ , రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

Updated Date - 2023-11-24T20:51:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!