సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sarath Babu: నటుడు శరత్ బాబు మృతి

ABN, First Publish Date - 2023-05-22T14:45:08+05:30

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) (72).. సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్‌ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) (72).. సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్‌ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ పాడైనట్లు వైద్యులు గమనించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. (RIP Sarath Babu).

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబుకి అగ్ర నటులు అయిన శివాజీ గణేశన్ (Sivaji Ganeshan), కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), శరత్ కుమార్ (Sarath Kumar) ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది.

శరత్ బాబు 1973వ సంవత్సరంలో ‘రామ రాజ్యం’ అనే సినిమాతో పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు కాపురం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రమాప్రభని పెళ్లిచేసుకోలేదు అని వివరించారు. ఆ తర్వాత తమిళ నాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేశాక, 2011 సంవత్సరంలో విడిపోయారు. 200కి పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు.. ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో కనిపిస్తూనే ఉన్నారు.

హీరోగానే కాకుండా విలన్‌గానూ శరత్‌బాబు రాణించారు. దాదాపు 300 చిత్రాలకు పైగా చిత్రాల్లో శరత్‌బాబు నటించారు. కె బాల చందర్‌ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం నిజల్‌ ‘నిజమగిరదు’ (1978) ద్వారా పాపులర్‌ అయ్యారు. మరో చరిత్ర, ‘ఇది కథకాదు’, ‘తాయరమ్మ బంగారయ్య’, ‘మూడు మూళ్ళ బంధం’, అయ్యప్ప మహాత్యం’, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, అభినందన, సాగర సంగమం, సితార, అన్వేషణ, స్వాతి ముత్యం, సంసారం ఒక చదరంగం, కోకిల, అపద్భాందవుడు, అన్నయ్య, క్రిమినల్‌, సంకీర్తన, శ్రీరామదాసు, మగధీర తదితర చిత్రాల్లో నటించారు. చివరిగా పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో కన్పించగా, తాజాగా నరేష్‌ పవిత్రా లొకేష్‌ జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతరంగాలు ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు శరత్‌బాబు. ‘వసంత ముల్లై’ (2023) తమిళంలో ఆయన నటించిన చివరి చిత్రం. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శరత్‌బాబు మూడు నంది అవార్డులను అందుకున్నారు.

ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం 5.30 ఫిలింఛాంబర్ కు తరలిస్తారు. అక్కడ 2 గంటలు ఉంచి రాత్రి ఏడూ గంటల తర్వాత చెన్నైకి తరలిస్తారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తెలిపారు.

Updated Date - 2023-05-22T16:46:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!