Kalyanam Kamaneeyam: నిరుద్యోగి భర్త కష్టాలు
ABN, First Publish Date - 2023-01-05T20:26:24+05:30
యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) హీరోగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam). ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) హీరోగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam). ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. డెబ్యుటెంట్ అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో మూవీ రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. నిరుద్యోగి భర్త కష్టాలను చూపించారు.
శివ అనే నిరుద్యోగి పాత్రను సంతోష్ శోభన్ పోషించాడు. శ్రుతి అనే ఉద్యోగం చేసే అమ్మాయిగా ప్రియ భవానీ శంకర్ కనిపించింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. శివకు ఉద్యోగం లేకపోవడం శ్రుతికి ఇబ్బందిగా మారుతుంది. కుటుంబంలో మనస్పర్థాలు తలెత్తుతాయి. ఈ బంధం ఆ తర్వాత ఎటువైపు దారి తీసిందనేదే సినిమా. ట్రైలర్‌లో అన్ని రకాల భావోద్వేగాలను మేళవించారు. కటుంబ సమేత చూడదగ్గ చిత్రంగా కళ్యాణం కమనీయం ఉండబోతున్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. డైలాగ్స్ అలరించాయి. ‘శివకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు కానీ శ్రుతి భర్తకు ఉద్యోగం ఉండాలి’ అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘పాతికేళ్లు మీ నాన్న మీద పడి బతికేసావ్.. ఇక మీదట.. నా మీద పడి బతకడానికి ప్లాన్ చేశావు అది మాత్రం జరగనివ్వను’’ అనే డైలాగ్ కూడా మెస్మరైజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అబ్బురపరిచింది. సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘తెగింపు’ వంటి నాలుగు చిత్రాల మధ్య ‘కళ్యాణం కమనీయం’ రిలీజ్ అవుతుంది.