Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?
ABN, First Publish Date - 2023-09-19T19:41:15+05:30
2021లో యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘మండేలా’. గ్రామ ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడీ సినిమాను ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
కోలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ కమెడియన్ ఎవరంటే.. కచ్చితంగా అందరూ యోగిబాబు పేరే చెబుతారు. ఒకవైపు కమెడియన్‌గా చేస్తూనే.. మరోవైపు తనే ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు యోగిబాబు. అలా.. 2021లో యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘మండేలా’ (Mandela). గ్రామ ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యోగిబాబు (Yogi Babu) నటనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించి.. జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో నటిస్తుంది ఎవరని అనుకుంటున్నారా? పై పిక్ చూస్తుంటే తెలియడంలా.. సంపూర్ణేష్ బాబు.
అతి తక్కువ సమయంలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటులలో సంపూర్ణేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలలోని ఎన్నో స్ఫూఫ్ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడాయన ‘మండేలా’ రీమేక్‌లో నటించబోతుండటంతో.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రీమేక్‌కి సంబంధించిన చిత్ర వివరాలను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. పూజ కొల్లూరు (Puja Kolluru) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఈ పోస్టర్‌లో తెలియజేశారు. (Martin Luther King First Look Out)
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) తలపై రెండు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఎన్నికల ప్రచారాన్ని చూపిస్తూ.. ‘మండేలా’లో ఉన్న మ్యాటర్‌ని క్లియర్‌గా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఓ గ్రామంలో జరిగే స్థానిక ఎన్నికలే ఇతివృత్తంగా తెరకెక్కే ఈ చిత్రంలో బార్బర్‌గా పనిచేసే సంపూర్ణేష్ బాబు ఓటే కీలకం అవుతుంది. ఈ ఓటు కోసం జరిగే ప్రక్రియలోనే అన్ని ఎమోషన్స్‌ని రాబట్టి.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం విశేషం. ఈ సినిమాకు ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది. మరి ఇందులో సంపూ ఎలా మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే అక్టోబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
============================
*Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్’ విలన్
**************************************
*Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్
***************************************
*Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ ఎవరో తెలిసేది అప్పుడే..
***************************************