Samantha : మార్పు దేనితో సాధ్యమంటే..!
ABN, First Publish Date - 2023-12-07T20:01:08+05:30
ఇటీవల ఖుషి సినిమాతో అలరించిన సమంత (Samantha) సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. మయోసైటిస్ వ్యాధితో బాధపుడుతున్న ఆమె విదేశాల్లో చికిత్స తీసుకుని ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు.
ఇటీవల ఖుషి సినిమాతో అలరించిన సమంత (Samantha) సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. మయోసైటిస్ వ్యాధితో బాధపుడుతున్న ఆమె విదేశాల్లో చికిత్స తీసుకుని ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. కుదిరినప్పుడు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్నారు. తాజాగా ఆమె చిన్న పిల్లల స్కూల్‌లో దర్శనమిచ్చింది. వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇనస్టాగ్రామ్‌లో పంచుకున్నారు. జూబ్లీహిల్స్‌లోనే ఓ ప్రీ స్కూల్‌లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్‌లో సామ్ పాల్గొన్నారు. దానికి సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ుూఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక పిల్లాడు, ఒక టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరు’ అని పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.