Samantha: అభిమాని కోరికకు... సామ్ సమాధానం!
ABN, First Publish Date - 2023-03-27T15:25:00+05:30
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత (Samantha) సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ఆమె నటించిన ‘శాకుంతలం’(Shakuntalam) చిత్రం ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. గుణశేఖర్ (Gunashekar)దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. గుణశేఖర్ - సమంత ప్రమోషన్స్ జోరు పెంచారు. దీనితో భాగంగా యాంకర్ సుమతో సమంత ముచ్చటించారు. శాకుంతలం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వీడియో క్లిప్ షేర్ చేసిన ఓ అభిమాని ‘‘ఇలా చెప్పేంత చనువు నాకు లేదని, అందుకు ఇది సరైన వేదిక కాదని తెలుసు. ప్లీజ్ సామ్ మీరు ఎవరితో అయినా డేట్ చేయండి’’ (please Date someone) అని తన మనసులో మాట చెప్పాడు ఆ అభిమాని. దీనిపై సమంత స్పందించారు. ఆ అభిమాని చేసిన ట్వీట్‌కు ‘మీలా అంతగా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’(Who will love me like you do) అంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. సామ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో లీడ్ రోల్లో సమంత నటించగా.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు.