Samantha: శాకుంతలం ప్లాప్ గురించి సమంత షాకింగ్ కామెంట్స్ ! ఇంతకీ ఏమందో తెలుసా...
ABN, First Publish Date - 2023-04-18T13:12:49+05:30
'శాకుంతలం' ప్లాప్ అయిన తరువాత మొట్టమొదటి సారిగా ఆ సినిమాలో శకుంతల పాత్ర వేసిన సమంత ఆ సినిమా ప్లాప్ గురించి కామెంట్ చేసింది. ఇంతకీ ఆమె ఏముందో తెలిస్తే షాక్ అవుతారు...
సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) చాలా నిరాశ చెందింది. అమీకేదో వింతవ్యాధి వచ్చింది అని కాదు ఈసారి, ఆమె సినిమా ఫలితం గురించి. ఆమె ఎంతో గొప్పగా చెప్పిన 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఫెయిల్ అయింది. ఈ సినిమా మీద సమంత (Samantha) ఎన్నో ఆశలు పెట్టుకుంది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ అనింది. కొన్ని పాత్రలు ఆలా వస్తాయి, కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి అనేట్టుగా ఈ 'శాకుంతలం' ఉంటుంది అని విడుదలకి ముందు చెప్పింది.
ఇందులో సమంత శకుంతల పాత్ర వెయ్యగా, మలయాళం నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) దుష్యంతుడిగా వేసాడు. ఈ సినిమా గత వారం థియేటర్ లో విడుదల అయింది. మొదటి రోజు మొదటి షో నుండే ఈ సినిమాకి నెగటివ్ టాక్ మొదలయింది. రెండో షో నుండి ప్రేక్షకులు ఈ సినిమాకి రావటం మానేశారు. ఇది ఎంత ఘోరంగా విఫలం అయింది అంటే, మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మించాడు. అతను కూడా చాలా నమ్మకంగా వున్నాడు ఈ సినిమా గురించి. అందుకే ప్రీమియర్ షో లు కూడా వేయించాడు. అక్కడే అసలు ఈ సినిమా నెగటివ్ టాక్ ప్రారంభం అయింది. ఎందుకంటే ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు అందరూ ఈ సినిమా నచ్చలేదు అని చెప్పారు.
అయితే మరి ఇంత డిసాస్టర్ అయిన ఈ సినిమా గురించి సమంత ఏమని కామెంట్ చేసిందో తెలుసుగా. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మాణి". ఇది భగవత్ గీత లోని శ్లోకం. శ్రీకృష్ణుడు, అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా ఉపదేశించిన గీతా సారము. అందులొచ్చి ఒక శ్లోకం తీసి సమంత తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. దీని అర్థం ఏంటంటే 'నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి', అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునిడితో. #BhagavadGita
మరీ ఇంత వేదంతం వచ్చేసింది సమంతకి ఇంత చిన్న వయసులో అని అందరూ అనుకుంటున్నారు. 'శాకుంతలం' పోయింది, ఇప్పుడు 'ఖుషి' (Khushi) సినిమా చేస్తోంది. 'సిటాడెల్' (Citadel) కూడా చేతిలో వుంది, కొత్తవి ఏవీ ఇంకా ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా, వెబ్ సిరీస్ ఫలితాల గురించి ఏమని అంటుందో చూడాలి.