Samantha Ruth Prabhu: ‘ఏ మాయ చేశావె’ లోకేషన్‌లో సామ్ మూవీ షూటింగ్
ABN, First Publish Date - 2023-03-31T19:56:18+05:30
మయోసైటిస్ నుంచి కోలుకున్న అనంతరం సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తున్నారు.
మయోసైటిస్ నుంచి కోలుకున్న అనంతరం సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభం కానుంది. అలెప్పీలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సామ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సమంత తొలి చిత్రం ‘ఏ మాయ చేశావె’ (Ye Maya Chesave) లో కొన్ని సన్నివేశాలను అలెప్పీలో చిత్రకరించిన సంగతి తెలిసందే. ఖుషిలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. పాన్ ఇండియాగా నిర్మిస్తుంది. విజయ్ ఈ చిత్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
సమంత ‘సిటడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌ను కూడా పట్టాలెక్కించారు. ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షోలో ఆమె గూఢచారి పాత్రను పోషిస్తున్నారు. ఈ సిరీస్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుండటంతో అనేక పోరాట సన్నివేశాలు ఉన్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం తన డైట్‌ను సామ్ మార్చుకుని ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఆమె ‘శాకుంతలం’ (Shakuntalam) లో నటించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. అందువల్ల సామ్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ‘శాకుంతలం’ కు గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టు ఇదే. ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టని విధంగా ఈ చిత్రాన్ని రూ.80కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం
Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..
Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్
SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ
Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!
Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?
Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..
SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..