Samantha: చిన్మయి పిల్లలతో ‘నాటు నాటు’ స్టెప్!
ABN, First Publish Date - 2023-08-07T16:17:16+05:30
హీరోయిన్ సమంతకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కొంతకాలానికి పిల్లల్ని కనాలనే కోరికను కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. విడాకుల అనంతరం సమంతపై వస్తున్న కామెంట్లకు స్పందించిన తన హెయిర్ డ్రెస్సర్ సామ్‌కు పిల్లలంటే ఎంతిష్టమో చెప్పుకొచ్చింది. అయితే తాను ఒకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచింది.
హీరోయిన్ సమంతకు (Samantha) పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కొంతకాలానికి పిల్లల్ని కనాలనే కోరికను కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. విడాకుల అనంతరం సమంతపై వస్తున్న కామెంట్లకు స్పందించిన తన హెయిర్ డ్రెస్సర్ సామ్‌కు పిల్లలంటే ఎంతిష్టమో చెప్పుకొచ్చింది. అయితే తాను ఒకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచింది. నాగచైతన్యతో (nagachaitanya) విడాకులు తీసుకోవడం, ఒంటరిగా ఉండడం జరిగింది. అయితే సమంత తన స్నేహితురాలి పిల్లలితో సమయం గడుపుతూ తన కోరికను తీర్చుకుటుంది. గాయని చిన్మయి సామ్‌కు మంచి స్నేహితురాలు. ఇండోనేషియా నుంచి తిరిగి వచ్చిన వెంటనే సమంత చిన్మయి ఇంటికి వెళ్లారు. వాళ్ల పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. సమంత కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె సినిమాలకు డబ్బింగ్ చెప్పింది చిన్మయే. అప్పటి నుంచి ఇద్దరికీ మధ్య మంచి స్నేహం కుదిరింది. తాజాగా వీళ్ల ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి సమంత సరదాగా గడిపారు. ఆ చిన్నారులతో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్ వేయించారు. పిల్లలతో పోటీ పడుతూ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే! తన కోసం తాను సమయం కేటాయిస్తూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతోన్న ఆమె చికిత్స నిమిత్తం కొన్ని నెలలపాటు విదేశాల్లో ఉంటారంటూ వార్తలొచ్చాయి. చికిత్స కోసం ఓ స్టార్ హీరో ఆమెకు రూ.25కోట్లు ఆర్థిక సాయం చేశారంటూ రెండ్రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే! ఈ వార్తలను ఆమె ఖండించారు. తాజాగా ఆమె నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌తో నటించింది. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది.