సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samantha: క్షణం క్రితం అసాధ్యం అనుకున్నా.. కానీ అదొక శక్తిమంతమైన మార్గం

ABN, First Publish Date - 2023-07-20T15:28:18+05:30

సమంత సినిమా షూటింగ్‌లకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. కమిట్‌ అయిన ప్రాజ్టెక్‌లు పూర్తి చేసి తన వ్యక్తిగత జీవితం కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఉన్నారామె. ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రశాంతంగా ధ్యానం చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను, ప్రకృతి అందాలను క్యాప్చర్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

సమంత (Samantha) సినిమా షూటింగ్‌లకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. కమిట్‌ అయిన ప్రాజ్టెక్‌లు పూర్తి చేసి తన వ్యక్తిగత జీవితం కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో (Isha Foundation) ఉన్నారామె. ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రశాంతంగా ధ్యానం (Samantha Simplicity) చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను, ప్రకృతి అందాలను క్యాప్చర్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ధ్యానంలోకి వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు వరకూ మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా, కూర్చున్న చోటు నుంచి కదలకుండా, మెదలకుండా, మెలికలు తిరగకుండా ఉండడం అసాధ్యమనిపించింది. కానీ ధ్యానమనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తిమంతమైన మార్గం అని ఈ రోజు అర్థమైంది. ఈ ప్రక్రియ సింపుల్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించలేదు’’ అని సమంత పేర్కొన్నారు.

సమంత అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో ఆమె అందరి మధ్యలో కూర్చుని సింపుల్‌గా కనిపించింది. సమంత సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. షూటింగ్‌లకు కాస్త బ్రేక్‌ ఇచ్చి సమంత ట్రీట్‌మెంత్‌ కోసం విదేశాలకు వెళ్లబోతుంది అంటూ నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఆమె హెయిర్‌ స్టైలిస్ట్‌ రోహిత్‌ భట్కర్‌ ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది. త్వరలోనే ఈ సిరీస్‌ విడుదల కానుంది.

Updated Date - 2023-07-20T15:29:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!