Samantha: మాస్కు తో సమంత, మళ్ళీ ఏమైంది అని అభిమానుల ఆందోళన, ఫోటో వైరల్
ABN, First Publish Date - 2023-04-27T12:11:34+05:30
నటి సమంత కి మళ్ళీ ఏమైంది, ఎందుకు ఆ ఫోటో షేర్ చేసింది, హాస్పిటల్ లో జాయిన్ అయ్యిందా, మళ్ళీ ఆ వ్యాధి బారిన పడిందా, ఇంతకీ సమంతకి ఏమైంది...
అగ్రనటి సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మళ్ళీ వార్తల్లో వుంది. ఈసారి ఆమె సాంఘీక మాధ్యమం అయిన ఇన్స్టాగ్రామ్ లో ఇంకో ఫోటో షేర్ చేసింది, అందులో ఆమె మళ్ళీ మొహానికి ఎదో వెంటిలేటర్ లాంటిది పెట్టుకొని వుంది. ఆమెకి మళ్ళీ ఏమైంది అని అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఆమెకి ధైర్యం చెపుతూ మెసేజ్ లు పంపుతున్నారు.
సమంత #Samantha కొన్ని రోజుల క్రితమే 'సిటాడెల్' #Citadel వెబ్ సిరీస్ షూటింగ్ కోసమని లండన్ (London) వెళ్ళింది. అక్కడకి వెళ్లిన వెంటనే, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన ఇంగ్లీష్ 'సిటాడెల్' వెబ్ సిరీస్ ప్రీమియర్ కి వరుణ్ ధావన్ (Varun Dhawan), దర్శకులు రాజ్ డీకే (Raj&DK) లతో హాజరయింది, ఆ ఫోటోలన్నీ కూడా సాంఘీక మాధ్యమాల్లో షేర్ చేసింది. అందులో ఆమె చాలా బాగుంది, గ్లామర్ గా కూడా వుంది. ఇంతలోనే మళ్ళీ మొహానికి ఆ మాస్కు లాటిది పెట్టుకొని వున్న ఒక ఫోటో షేర్ చేసింది.
సమంత 'యశోద' (Yashoda) సినిమా షూటింగ్ తరువాత ఆమె మయోసిటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు ఆ వ్యాధి నుండి కోలుకోవడానికి ఆమెకి టైం పట్టింది. ఆ తరువాత 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా ప్రచారాల్లో పాల్గొని తాను ఎంత బాధ పడిందో కూడా చెప్పింది. పాపం 'శాకుంతలం' మీద ఎంతో ఆశ పెట్టుకుంది కానీ, ఈ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన సినిమా ఆమె ఆశలను గల్లంతు చేసింది. ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది, సమంత ట్రోలింగ్ కి గురయింది.
పోనీలే అనుకున్న సమయానికి నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి (Tripuraneni Chitti), సమంతని చాల దారుణంగా విమర్శించాడు. ఆమె అందం పోయిందని, ఆమె కథానాయకురాలిగా పనికిరాదని ఇలా ఏవేవో అన్నాడు. సమంత కూడా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది. చెవిలో జుత్తు ఎందుకు పెరుగుతుందో అని సమంత గూగుల్ చేస్తే ఎక్కువ టెస్టోస్టెరోన్ (Testosterone) ఉంటే అని గూగుల్ లో చెప్పింది అని. ఇలా ఆ ప్రొడ్యూసర్ మీద కౌంటర్ కూడా వేసింది సమంత. దానికి చిట్టి కూడా రిప్లై ఇస్తూ నేను నీ గురించి చెప్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని కూడా అన్నాడు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు సమంత పెట్టిన ఈ ఫోటో చూసి అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో వారు కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆమె 'ఖుషి' (Khushi) సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం పూర్తి చెయ్యాలి, అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చెయ్యాలి. ఇవి కాకుండా ఇంకా సినిమాలు ఏవీ కొత్తవి ఒప్పుకోలేదని తెలిసింది.