Samantha: నవ్వులు, ఏడుపు, హర్షద్వానాలు, చప్పట్లు మధ్య సమంత మళ్ళీ జనాల మధ్యకి
ABN, First Publish Date - 2023-01-09T15:34:32+05:30
సమంతని పూర్తి ఆరోగ్యంగా చూసింది కరణ్ జోహార్ (Samantha last seen in good health in Karan Johar's talk show) షో లో ఆమె అతిధిగా వచ్చినపుడు. అది గత ఏడాది జులై లో అనుకుంటా, అంతే ఆ తరువాత సమంత మీడియా ముందుకు గానీ, పబ్లిక్ గా కనపడటం కానీ జరగలేదు.
సమంతని పూర్తి ఆరోగ్యంగా చూసింది కరణ్ జోహార్ (Samantha last seen in good health in Karan Johar's talk show) షో లో ఆమె అతిధిగా వచ్చినపుడు. అది గత ఏడాది జులై లో అనుకుంటా, అంతే ఆ తరువాత సమంత మీడియా ముందుకు గానీ, పబ్లిక్ గా కనపడటం కానీ జరగలేదు. ఆమె సినిమా 'యశోద' విడుదల అయినప్పుడు కూడా ఆమె ఒక ఇంటర్వ్యూ తన ఇంట్లోనే చేసి అదే అందరికీ పంపింది. అంతే కానీ ఆమె బయటకి మాత్రం రాలేదు. సుమారు ఏడు ఎనిమిది నెలలు అయి ఉంటుందేమో, ఆమె బయటకి వచ్చి. (She is suffering with Myositis and recovered slowly) ఆ తరువాత ఆమెకి మాయోటిన్ (Myositis) అనే వ్యాధి రావటం, దానితో ఆమె మీద ఎన్నో పుకార్లు బయలుదేరటం జరిగింది. ఒకపక్క ఆరోగ్యానికి వైద్యం చేయించుకుంటూ, ఇంకో పక్క తన సినిమాలకి ప్రొమోషన్ ఎలా అయినా చెయ్యాలన్న తపనతో, సమంత మళ్ళీ కొన్ని నెలల తరువాత బయటకి వచ్చింది. (After almost seven months Samantha appeared in front of media)
ఆమె వస్తోంది అని తెలిసి మీడియా వాళ్ళ హంగామా ఇంత అంతా కాదు. సుమారు ఒక 50 కేమెరాల ఫ్లాష్ ఒక్కసారిగా ఆమె మీద పడింది. ఇది ఆమెకి ఒక కొత్త జీవితం, చాలా గ్యాప్ తరువాత ఆలా కిక్కిరిసిన మీడియా ముందుకు రావటం, అదే వేరేవాళ్లు అయితే ఒక్కసారిగా డీలా పడిపోతారేమో, కానీ ఆమె సమంత, అందుకే ఏమి తడబడకుండా, మనసులో ఎంతో టెన్షన్ గా వున్నా, నవ్వుతూనే అందరినీ పలకరించింది. అదీ సమంత అంటే! అందరూ ఆమెని చూసి ఆశ్చర్యపోయారు, ఇంత ఒడుదుడుకుల్లో కూడా ఆమె అంత స్ట్రాంగ్ గా ఎలా వుంది, అంతే స్ట్రాంగ్ గా మళ్ళీ మీడియా ముందుకు ఎలా రాగలిగింది అని. ఆమె విల్ పవర్, ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలి.
'శాకుంతలం' ట్రైలర్ కి థియేటర్ లోకి ఆమె ఎంటర్ అయినప్పుడు, అభిమానులు, ఆమెని చూసి ఉవ్వెత్తున చప్పట్లతో, హర్షద్వానాలతో ఆమెకి స్వాగతం పలికినప్పుడు, ఆమె మొహం మీద అదే చిరునవ్వు. ఎప్పుడూ సమంత మొహం చిరునవ్వుతోనే కనిపించేది. ఇప్పుడు అలానే. ఆమెకే ఎందుకు ఈ వ్యాధి రావాలి, పాపం అని అనుకున్నవాళ్ళు కూడా అక్కడ వున్నారు. ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అని తెలుస్తోంది ఆ అరుపులు విన్నాక. అందుకేనేమో ట్రైలర్ కూడా సమంత అభిమానులతో విడుదల చేయించారు, చిత్ర నిర్వాహకులు. ఇది మాత్రం హర్షించదగ్గ విషయం. (The trailer of #Shaakuntalam released by Samantha fans)
ఇంకా దర్శకుడు గుణశేఖర్ (Director Gunasekhar gets emotional when he speaks and at that time Samantha also cried) తాను మాట్లాడవలిసి వచ్చినప్పుడు కొంచెం భావోద్వేగానికి గురి అయినపుడు, సమంత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే ఈ సినిమాకి అంత కష్టపడ్డారు అందరూ. ఇంక సమంత మాటలు కూడా చాలా భావేద్వేగంగా వున్నాయి. కేవలం దర్శకుడు గుణశేఖర్ కోసమే తాను ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పింది. ఎందుకంటే చాలామందికి సినిమా అంటే జీవితం లో ఒక భాగం అని, కానీ గుణశేఖర్ కి సినిమానే జీవితం అని చెప్పింది సమంత. అందువల్ల అయన కోసం ఓపిక, శక్తి తెచ్చుకొని వచ్చాను అని చెప్పింది.
హాట్సాఫ్ టు సమంత! ఎందుకంటే తను ఎలాంటి పరిష్టితిలో వుంది అన్నది అందరికి తెలుసు, తరవాత జరిగే ప్రమోషన్స్ కి వస్తాను అని చూపొచ్చు కూడా, లేదా ఇంకేదో కారణం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఆమె ఆరోగ్యం అంతగా సహకరించకున్నా, తాను నమ్మిన, చేసిన సినిమా కోసం, సినిమా తీసిన వాళ్ళ కోసం వచ్చింది. ఆమె స్టేజి మీద కూర్చుంది కానీ, లో లోపల చాల టెన్షన్ పడుతోంది అని కనిపిస్తోంది. కానీ అవన్నీ తట్టుకొని, చాలా చక్కగా మాట్లాడి, అందరి ప్రశంసలు అందుకుంది. అంతే కాదు, ఇంకా మరికొంచెం ఎక్కువమంది అభిమానులని సంపాదించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ధైర్యంగా నిలబడి ఎలా ఎదుర్కోవాలో నిరూపించింది అందుకే ఆమె ఒక రోల్ మోడల్ అందరికీ. ఆమెకి ఇంతటి అభిమానుల అండ ఉన్నంతసేపు, ఏమి కాదు, ఇలా ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. సమంత శకుంతల అయితే దేవ్ మోహన్ (Dev Mohan) దుష్యంతుడుగా కనిపిస్తాడు.