కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samantha: నీది నిష్కల్మషమైన మనసు

ABN, First Publish Date - 2023-08-17T12:47:31+05:30

సమంత (Samantha) , గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్నయి (Chinmayi) స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే! ‘రక్త చరిత్ర’ సినిమాలో రాధిక ఆప్టేకు డబ్బింగ్‌ చెప్పడంతో తెలుగులో ఆమె కెరీర్‌ మొదలైంటి. అయితే ‘ఏమాయ చేశావె’ చిత్రంలో సమంతకు వాయిస్‌ ఇవ్వడంతో ఆమెకు తెలుగులో గుర్తింపు దక్కింది.

సమంత (Samantha) , గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్నయి (Chinmayi) స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే! ‘రక్త చరిత్ర’ సినిమాలో రాధిక ఆప్టేకు డబ్బింగ్‌ చెప్పడంతో తెలుగులో ఆమె కెరీర్‌ మొదలైంటి. అయితే ‘ఏమాయ చేశావె’ చిత్రంలో సమంతకు వాయిస్‌ ఇవ్వడంతో ఆమెకు తెలుగులో గుర్తింపు దక్కింది. ‘మీకు డబ్బింగ్‌ చెప్పడం వల్లే తెలుగులో ఇంతగా పాపులర్‌ అయ్యాను’ అని చిన్మయి తరచూ సమంత గురించి చెబుతుంటారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని చిన్మయి గుర్తు చేశారు. ‘విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ‘ఖుషి' (Kushi) మ్యూజికల్‌ నైట్‌’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చిన్మయి పాల్గొని పలు మధురమైన పాటలు ఆలపించారు. సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

‘‘సామ్‌.. నీతో ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. తెలుగులో నా డబ్బింగ్‌ కెరీర్‌ మొదలైంది నీవల్లే. నువ్వు ఎంతోమందిలో స్ఫూర్తి నింపావు. ఈ ప్రపంచంలో మంచి మనసున్న, ధైర్యమున్న, అందమైన వ్యక్తుల్లో సమంత ఒకరు. ఎవరు ఏం మాట్లాడినా నువ్వు ఎప్పటికీ బెస్ట్‌’’ అంటే అమృత చిత్రంలోని ‘ఏ దేవి వరము నీవో’ పాట పాడి సమంతకు డెడికేట్‌ చేశారు. చిన్మయి మాటలకు సామ్‌ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ఇన్‌స్టా స్టాటస్‌లో షేర్‌ చేసి చిన్మయిని ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు. ‘నీది నిష్కల్మషమైన మనసు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ‘ఖుషి’ మ్యూజికల్‌ నైట్‌లో పాల్గొని నాపై ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. నీ మాటలతో ఆ కార్యక్రమం నాకు మరింత ప్రత్యేకంగా మారింది. నీ మనుసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని ఆ దేవుడు నీకు ప్రసాదించాడు’’ అని సమంత పేర్కొంది. ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది.

Updated Date - 2023-08-17T12:47:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!