Shaakuntalam - Samantha: మనసులో మాట బయటపెట్టి భావోద్వేగం..
ABN, First Publish Date - 2023-01-09T15:09:55+05:30
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. మయోసైటిస్ సమస్య కారణంగా కొంతకాలంగా బయటకు రాకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మీడియా ముందుకొచ్చారు.
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత (Samantha) వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. మయోసైటిస్ సమస్య కారణంగా కొంతకాలంగా బయటకు రాకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మీడియా ముందుకొచ్చారు. ‘శాకుంతలం’ ట్రైలర్ (Trailer launch) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సామ్ పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల అనంతరం గుణ శేఖర్ మాట్లాడుతూ ‘‘శాకుంతలం’ చిత్రంలో ముగ్గురు హీరోలున్నారు. కథకు హీరో దేవ్ మోహన్ అయితే.. ఈ సినిమాకు హీరో సమంత. తెర వెనుక హీరో దిల్‌రాజు(dil raju main piller) . ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్‌రాజుకు ఇస్తా. ‘శాకుంతలం’ విషయంలో ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయము. దిల్ రాజు అండగా ఉండటం వల్ల నేను అనుకున్న చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. నా కుమార్తె ఇండియాకు వచ్చిన వెంటనే నిర్మాతగా కావాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని నాతో చెప్పి కథలు అడిగింది. నేను ఈ కథ చెప్పాను. పురాణాల్లోని ఇలాంటి అద్భుతాలను ఈ తరానికి చెప్పాలని నీలిమ కోరింది. శకుంతలగా సమంత అయితేనే బాగుంటుందని చెప్పింది. దాంతో ఆమెకు కథ చెప్పా. నచ్చి అంగీకరించింది. తర్వాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. హీరోయిన్‌ని నమ్మి కోట్టు బడ్జెట్ పెట్టిన ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ గుణశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలతో సమంత కూడా కన్నీరు పెట్టుకున్నారు. (Shaakuntalam on Feb 7)
ఊహలు దాటిన సినిమా ఇది: సమంత (Samantha emotional speech)
‘‘చాలారోజులుగా ఈ తరుణం కోసం ఎదురుచూస్తున్నా. శాకుంతలం’ నా మసుకు దగ్గరైన సినిమా. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. గుణశేఖర్‌గారి కష్టాన్ని చూసి ఓపిక లేకపోయినా ఆయన మీదున్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను. కొంతమందికి సినిమా వాళ్ల జీవితంలో భాగమవుతుంది. కానీ, గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఆయనపై మీరు చూపించే ప్రేమాభిమానాన్ని చూడాలనుకున్నా. అందుకే వచ్చా. కథ వినగానే సినిమా బాగా రావాలని సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్నిసార్లు ఊహను దాటి పోతాయి. ‘శాకుంతలం’ చూశాక నాకూ అదే భావన కలిగింది. మాకు సపోర్ట్‌గా నిలిచిన దిల్‌రాజుకు థ్యాంక్స్. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతలా ప్రేమిస్తానో... సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని తన మనసులో మాట చెప్పారు సమంత. ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.