Samantha: 13 ఏళ్ల కెరీర్.. భావోద్వేగ పోస్ట్.. ఇకపై అలా కాదు !
ABN, First Publish Date - 2023-02-27T13:28:51+05:30
సమంత (Samantha)కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమై పదమూడేళ్లు (13 years Career) పూర్తియింది. హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ (Yemaya chesave completes 13 years) విడుదలై ఆదివారానికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
సమంత (Samantha)కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమై పదమూడేళ్లు (13 years Career) పూర్తియింది. హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ (Yemaya chesave completes 13 years) విడుదలై ఆదివారానికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సమంత అభిమానులను ఉద్దేశించి (Samantha emotional post) ఓ పోస్ట్ చేశారు. తనపై ఇంత ప్రేమను చూపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ఈ జర్నీలో ఎన్నో విషయాలు బాధించాయి. ఇకపై ఏదీ నన్ను బాధపెట్టదు. నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం ప్రయాణించినా.. అభిమానులు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. అలాగే, నాకు కొత్త విషయాలను పరిచయం చేస్తోన్న ప్రతిరోజుకూ థ్యాంక్స్. గతంలో ఎన్నో విషయాలు బాధపెట్టాయి. ఇకపై అలా కాదు. కేవలం అభిమానుల ప్రేమ, కృతజ్ఞతతో ఇలా కొనసాగుతున్నా’’ అని సమంత ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘ఏమాయ చేసావె’ చిత్రంలో జెస్సీగా మెప్పించిన సమంత ఆ తర్వాత తెలుగునాట అగ్రతారగా ఎదిగారు. ఈ సినిమాతోనే నాగచైతన్యతో సామ్‌కు స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారి, పెళ్లి వరకూ తీసుకెళ్లింది. ఏడేళ్ల ప్రేమ తర్వాత 2017లో చై-సామ్ పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2021 అక్టోబర్‌లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ నెల 26వ తేదితో ‘ఏమాయ చేసావె’ చిత్రం 13 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను నాగచైతన్య పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సామ్ విషయానికొస్తే.. కొంతకాలంగా ఆమె ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని వల్ల చికిత్స పొందుతూ కొన్ని నెలలపాటు ఆమె బయటకు రాలేదు. అతి కష్టంగా ‘యశోద’ (yashoda)సినిమా ప్రమోషన్స్ కోసం ఏ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడామె కొంతవరకు కోలుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నారు. ‘శాకుంతలం’ (shakuntalam) ప్రమోషన్స్‌లో పాల్గొంటు, రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. త్వరలోనే ‘ఖుషి’ చిత్రీకరణలోనూ సామ్ జాయిన్ కాబోతున్నారు.