సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha: అతని ఉన్నత స్థాయిని, కష్ట సుఖాలను చూశా!

ABN, First Publish Date - 2023-06-01T19:41:02+05:30

విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం తుర్కియే లో చిత్రీకరణ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)ను ఉద్దేశించి సమంత (Samantha)ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’(Kushi). శివ నిర్వాణ దర్శకుడు0Shiva nirvana). మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం తుర్కియే లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల చిత్ర బృందం అక్కడికి చేరుకున్నారు. అక్కడ షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పాక విజయ్‌, సామ్‌ డిన్నర్‌ డేట్‌కు (Dinner Date) వెళ్లారు. దీనికి సంబంధించి ఓ ఫొటోను సామ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అంతే కాదు విజయ్‌ దేవరకొండతో తనకున్న అనుబంధం గురించి రాసుకొచ్చారు.

‘‘నీ ఉన్నత స్థాయిని, సంతోషాలను చూశా, నీ కష్టాలను, ఎత్తుపల్లాలను చూశా. నువ్వు ప్రథమ స్థానంలో ఉండడం, అలాగు చివర్లో ఉండటాన్ని చూశా. ఎలాంటి సమయాల్లోనైనా కొంతమంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు’’ అని ఆమె పోస్ట్‌ చేసింది. దీనికి విజయ్‌ దేవరకొండ రిప్లై ఇచ్చారు. ‘సమంత నా పేవరెట్‌ లేడీ’ అని వీడీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలే నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరి నెటిజన్లు.. ఫ్రెండ్‌షిప్‌ చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో సామ్‌ - విజయ్‌ దేవరకొండ ‘మహానటి’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Updated Date - 2023-06-01T19:42:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!