Samantha: తిన్న దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు!
ABN, First Publish Date - 2023-04-02T17:08:21+05:30
నాగచైతన్యతో (Naga chaitanya) విడాకులతో కొంత కుంగిపోయారు సమంత (samantha). తర్వాత కొన్నాళ్లు మయోసైటిస్ అఏ వ్యాధితో బాధపడుతూ ఈ మధ్య కాస్త కోలుకున్నారు.
నాగచైతన్యతో (Naga chaitanya) విడాకులతో కొంత కుంగిపోయారు సమంత (samantha). తర్వాత కొన్నాళ్లు మయోసైటిస్ అఏ వ్యాధితో బాధపడుతూ ఈ మధ్య కాస్త కోలుకున్నారు. వ్యక్తిగత జీవితం, అనారోగ్యం ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి ఈ మధ్యనే సమంత మాట్లాడుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను సామ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. అవన్నీ చీకటి క్షణాలు అని సమంత పేర్కొన్నారు. హృదయానికి తగిలిన ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ (sam about Trolls) గురించి అడగ్గా.. ‘‘ఆ సమయంలో నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్ అయ్యానంతే. నన్ను కామెంట్ చేసినవాళ్లు కొంతమంది ఉంటే మద్దతుగా నిలిచిన వారు ఎక్కువమంది ఉన్నారు. వారికి ఎప్పటికీ రణపడి ఉంటా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. *samantha Dark days)
‘నన్ను చాలామంది స్వతంత్ర భావాలున్న బలమైన మహిళగా చెబుతుంటారు. కానీ నన్ను నేను అలా అనుకోను. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశా. ‘అమ్మా నాకు మంచే జరుగుతుందా?’ అంటూ రోజూ అడుగుతూనే ఉండేదాన్ని. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశా. నా చుట్టూ చీకటి ఆవరించినట్లు ఉండేది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా మైండ్ సతమతమైపోయేది. అయితే ఆ ఆలోచనలు నన్ను, నా కెరీర్‌ను నాశనం చేయకూడదనుకున్నా. ధైర్యంగా ముందడుగు వేశా. కుటుంబ సభ్యులు, స్నేహితులు నా వెంట నడిచారు. నేను ఇక్కడ ఇలా ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే వాళ్లే కారణం. పనిలో ఎంత నిమగ్నమైనా, నా చుట్టూ నా మంచి కోరేవారు ఎంతో మంది ఉన్నా.. తిన్న దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పటితో పోల్చితే చీకటి తగ్గి కాస్త వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. అతి కష్టమైన పరిణామాలు చవిచూసిన తర్వాతే మనిషిలో ధైర్యం పెరుగుతుందని నాకు అప్పుడే అర్థమైంది. ఎప్పటికీ ఆ క్షణాలు అలాగే ఉండిపోవు అన్న నిజాన్ని తెలుసుకోవాలి’’ అని అన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలక పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’. దేవ్ మోహన్, మోహన్‌బాబు, మఽధుబాల ఇతర పాత్రల్లో కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మించారు. ఈ నెల 14న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. (Samantha Divorce)