TollywoodBoxOffice: 'సామజవరగమన' అదుర్స్, నిరాశ పరిచిన నిఖిల్ 'స్పై'
ABN, First Publish Date - 2023-07-03T19:13:37+05:30
గత వారం సుమారు అయిదు సినిమాలు విడుదల అవగా అందులో ఒకే ఒక సినిమా, శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మిగతావన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నిఖిల్ 'స్పై' సినిమా కూడా మొదటి రోజు తప్ప రెండో రోజు నుండీ ఏమీ లేదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.
గత వారం బక్రీద్ (Bakrid) సెలవు రావటంతో నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) నటించిన పాన్ ఇండియా సినిమా 'స్పై' #Spy గురువారమే విడుదల అయింది. తరువాత చాలా చిన్న సినిమాలు శ్రీవిష్ణు (SreeVishnu) నటించిన, 'సామజవరాగమన' #Samajavaragamana, దశరథ్ (Dasarath) నిర్మాతగా మారి తీసిన సినిమా 'లవ్ యు రామ్' #LoveYouRam, మొబైల్ మీద బయోపిక్ అంటూ 'మాయాపేటిక' #Mayapetika, 'హ్యాపీ డేస్' ఫేమ్ సుధాకర్ నటించిన 'నారాయణ & కో' #Nayarana&Co కూడా విడుదల అయ్యాయి.
వీటన్నటిలో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'స్పై' #SpyMovie సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. ఈ సినిమా కథ కూడా సుభాష్ చంద్ర బోస్ (SubhashChandraBose) డెత్ మిస్టరీ మీద ఉండబోతోందని, ఇది కచ్చితంగా ఆడుతుందని నిఖిల్ ఎంతో ఆశ పెట్టుకున్నాడు. దీనికి గ్యారీ బిహెచ్ (Garry Bh) దర్శకుడు కాగా, రాజశేఖర్ రెడ్డి (RajasekharReddy) నిర్మాత. ఈ సినిమాని జూన్ 29 న విడుదల చేశారు. అయితే సినిమా విడుదల విషయంలో, నిర్మాతకి, కథానాయకుడు నిఖిల్ కి మధ్య కొంచెం వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చివరికి నిఖిల్ వొప్పుకొని ఈ సినిమా ప్రచారం చెయ్యాలని అనుకొని, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలు కూడా తిరిగి ప్రచారం చేసేడు.
ఈ సినిమా మొదటి బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ప్రపంచం మొత్తం రూ. 11.7 కోట్ల గ్రాస్ కలెక్టు చేసింది. అయితే ఈ సినిమా మీద బాగా నెగటివ్ టాక్ వచ్చింది. ఇందులో నాసిరకం గ్రాఫిక్స్, క్లైమాక్స్ తొందర తొందరగా తీయటం, అలాగే చాలా సన్నివేశాలు బోర్ కొట్టడం లాంటివి ఉండటంతో అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకులు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అందుకని రెండో రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఈ సినిమాకి సుమారు రూ.45 కోట్లవరకు బడ్జెట్ అయిందని అంచనా. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) ఓటిటి చాలా ఎక్కువ ధరకు కొందని, అందువలనే గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోయినా జూన్ 29 న విడుదల చేసేశారని తెలిసింది. ఇక నిఖిల్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ల్లో ఆడుతుంది అనుకున్నాడు, కానీ హిందీ, మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఏమీ రాలేదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. నిఖిల్ ముందు సినిమా 'కార్తికేయ 2' #Karthikeya2 బాగా ఆడటంతో ఈ 'స్పై' #Spy మీద అసలు పెట్టుకున్నాడు, కానీ అతని అసలు నిరాశే అయింది. నాలుగు రోజులకు గాని నిఖిల్ 'స్పై' ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం రూ.7.16 కోట్ల షేర్ ను మాత్ర కలెక్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.9.98 కోట్ల షేర్ కలెక్టు చెయ్యగా, ఈ సినిమా ప్లాప్ అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ #RebaMonicaJohn జంటగా నటించిన 'సామజవరాగమన' #Samajavaragamana సినిమా మొదటి రోజు అంతగా కలెక్షన్స్ లేకపోయినా, మౌత్ టాక్ తో బాగా అందుకుంది. నాలుగు రోజులకు గాను ఈ సినిమా సుమారు రూ. 5.2 కోట్ల వరకు కలెక్టు చేసిందని, ఇది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిందని చెపుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ గా వుంది అని, ఇది ఈ వారం కూడా బాగుంటుందని అనుకుంటున్నారు. రామ్ అబ్బరాజు (RamAbbaraju) దర్శకత్వం వహించిన ఈ సినిమా హిలేరియస్ కామెడీతో ముందుకు దూసుకుపోతోంది. నరేష్ (VKNaresh), వెన్నెల కిషోర్ (VennelaKishore), సుదర్శన్ (Sudarshan) ల కామెడీ అదిరింది, శ్రీవిష్ణు మొత్తం ఈ సినిమాని తన బుజాలమీదకి ఎత్తుకున్నాడు. ఇందులో నటించిన కథానాయకురాలు రెబా మోనికా జాన్ కి కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ దిశగా వెళుతోంది.
ఇక మిగతా సినిమాలు ఏవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయాయి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.
ఇది కూడా చదవండి:
Samajavaragamana Film Review: నవ్వుల నజరానా !
Spy Film Review: ఈ పాన్ ఇండియా మిషన్ ఫెయిల్ అయింది !