సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prabhas: సలార్‌ సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌.. ఇది నిజమేనా?

ABN, First Publish Date - 2023-04-01T19:26:29+05:30

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ఆస్కార్‌ సాధించడంతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ఆస్కార్‌ సాధించడంతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగింది. భవిష్యత్తులో రాబోయే భారీ చిత్రాలకు విదేశాల్లో (Overseas MArket) భారీ మార్కెట్‌ ఉంటుంది. ఓవర్సీస్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ఆకాశాన్ని అందేలా ఉండబోతున్నాయి. ‘సలార్‌’ (salaar) చిత్రం ఓవర్సీస్‌ ధర చూస్తే అది నిజమే అనిపించక తప్పదు. సలార్‌ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఓవర్సీస్‌ హక్కులు రూ. 70 కోట్లకు (Salaar overseas rights For 70 Crores) కొనుగోలు చేశారని టాక్‌ నడుస్తోంది. ఓవర్సీస్‌ రైట్స్‌ పరంగా అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం ఇదేనని చెబుతున్నారు. దీంతో ప్రభాస్‌ క్రేజ్‌ మరింత పెరిగిందని అభిమానులు సంబరపడిపోతున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నటించే ప్రతి చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ భారీ స్థాయిలో రూపొందినవే! ప్రభాస్‌ స్టార్‌డమ్‌, కేజీఎఫ్‌తో ప్రశాంత్‌ తెచ్చుకున్న గుర్తింపుతోనే ఓవర్సీస్‌లో ‘సలార్‌’ చిత్రానికి ఇంత భారీ రేటు పలికిందని చెబుతున్నారు. ఓవర్సీస్‌ రైట్స్‌ రూ. 70 కోట్లు పలికిందనే వార్త వైరల్‌ కావడంతో ఇది సాధారణ విషయం కాదంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-04-01T20:50:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!