సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sai Pallavi: సవాల్‌ విసిరిన యాత్ర.. జీవితంలో ఎంతో గొప్ప యాత్ర!

ABN, First Publish Date - 2023-07-15T16:12:08+05:30

భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్రలో భాగమయ్యారు సాయి పల్లవి. తల్లిదండ్రులతో కలిసి ఆమె ఈ యాత్రకు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సాయి పల్లవి. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాల్‌ చేసిందని, మానసికంగా పలు పరీక్షలు పెట్టిందని ఆమె పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్రలో ( Amarnath Yatra) భాగమయ్యారు సాయి పల్లవి (Sai pallavi). తల్లిదండ్రులతో కలిసి ఆమె ఈ యాత్రకు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సాయి పల్లవి. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాల్‌ చేసిందని, మానసికంగా పలు పరీక్షలు పెట్టిందని ఆమె పేర్కొన్నారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా ఓ దృశ్యం తన మనసును కట్టిపడేసిందని చెప్పారు.

‘‘నా వ్యక్తిగత విషయాలను బయటకు పంచుకోవడానికి ఆసక్తి చూపించను. కానీ నేను చేసిన అమర్‌నాథ్‌ యాత్ర తీర్థయాత్ర గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఎంతోకాలం నుంచి వెళ్లాలని కలలు కన్న యాత్రం. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లు విసిరింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతీ పట్టుకోవడం.. దారి మధ్యలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూసి.. ‘స్వామీ.. మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు?’ అని ప్రశ్నించాను. అయితే దైవ దర్శనం అనంతరం నా ప్రశ్నకు సమాధానం దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే దృశ్యాలను చూశాను. ఆ యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతూ ఉండగా వాళ్లలో ధైర్యం నింపడం, శక్తిని ఇవ్వడానికి చుట్టు పక్కన ఉన్నవాళ్లందరూ ‘ఓం నమః శివాయా’ (Om Namah Shivaya) అంటూ పరమేశ్వరుడి నామాన్ని గట్టిగా స్మరించారు.

వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు సాగారు. పవిత్రమైన ప్రాంతంలో ఉన్న భోలేనాధుణ్ణి దర్శించకోవడానికి కొందరు భక్తులను అక్కడి గ్రామస్థులు గుర్రాలపై తీసుకెళ్తారు. మాలాంటి లక్షలాది మంది భక్తులకు ఈ యాత్రను చిరస్మరణీయం చేసిన శ్రీ అమర్‌నాథ్‌ జీ (Shri Amarnath Ji Shrine Board) దేవాలయం బోర్డులోని ప్రతి ఒక్కరికీ నా ప్రణామాలు. యాత్రలో భక్తులను సంరక్షిస్తున్న ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, పోలీస్‌ సిబ్బందికి ధన్యవాదాలు. నిస్వార్ధమైన సేవలకు ఇది సాక్షిగా నిలుస్తుంది కాబట్టే ఈ ప్రదేశం శక్తిమంతమైంది. సంపద, అందం, పవర్‌తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే ఈ భూమిపై మన ప్రయాణానికి ఒక విలువను ఇస్తుంది. ఈ అమర్‌నాథ్‌ యాత్ర నా సంకల్ప శక్తిని సవాల్‌ చేయడంతోపాటు నా ధైర్యాన్ని పరీక్షించింది. మన జీవితమే ఒక తీర్థయాత్ర అని తెలిసేలా చేసింది. మనిషిగా ఉన్నందుకు ఎదుటి వ్యక్తులకు సాయం చేయకపోతే మనం చనిపోయిన వాళ్లతో సమానమని తెలియజేసింది’’ అని సాయి పల్లవి ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-07-15T16:12:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!