Sai Tej Post Viral : నీకేమో పెళ్లి సంబరాలు.. నాకేమో..!
ABN, First Publish Date - 2023-11-13T16:44:09+05:30
మెగా కుటుంబంలో (Mega Family) ఇటీవల పెళ్లి భాజాలు మోగాయి. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల (VarunLav) వివాహం ఇటీవల ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది
మెగా కుటుంబంలో (Mega Family) ఇటీవల పెళ్లి భాజాలు మోగాయి. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల (VarunLav) వివాహం ఇటీల ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. డెస్టినేషన వెడ్డింగ్లా భారీగా ప్లాన్ చేసిన ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్(Sai tej), అల్లు అర్జున్ , నితిన్ తదితరులు పాల్గొని సందడి చేశారు. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
సాయి తేజ్ తన ఇంస్టాలో పెళ్ళికి సంబందించిన మూడు ఫోటోలు పోస్ట్ చేసాడు. అందులో వరుణ్ తేజ్‌ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫొటో ఫన్నీగా ఉంది. వరుణ్‌తేజ్, సాయితేజ్ వైపు చిరునవ్వుతో చూశాడు. ఆ ఫొటోను షేర్ చేసి "ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు(Varuntej) .. ష్... నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం’ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. దానికి వరుణ్‌తేజ్ 'అంతేగా.. అంతేగా’ అని ఫన్నీ కామెంట్ చేశాడు. ఆ పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు తేజ్ మాటలకు నవ్వులు పూయించారు. అది చూసిన అభిమానులు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.