కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sai Dharam tej : పుట్టినరోజు సందర్భంగా రూ.20 లక్షలు విరాళం!

ABN, First Publish Date - 2023-10-16T10:12:14+05:30

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఆదివారం ఆయన పుట్టిన సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు సైనికులు, పోలీస్‌ వ్యవస్థ అంటే ఎనలేని గౌరవం.

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ (Sai tej) తేజ్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఆయనకు సైనికులు, పోలీస్‌ వ్యవస్థ అంటే ఎనలేని గౌరవం. ఆదివారం ఆయన పుట్టిన సందర్భంగా సమాజ భద్రత కోసం పాటుపడే వారి క్షేమం కోరి విరాళాలు ఇచ్చారు. భారతదేశ సైన్యం ( indian Soldiers)కోసం రూ. 10 లక్షలు విరాళం అందజేశారు. ఆంధ్రా, తెలంగాణ అకాడమీలకు చెరొక 5 లక్షల విరాళాన్ని ఆయన అందజేశారు. గత ఏడాది కూడా తేజ్‌ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధుల కోసం విజయవాడలో ఓ బిల్డింగ్‌ను కట్టించారు. అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాదు అభిమానులు కూడా తమవంతుగా పలు సేవ కార్యక్రమాలు చేశారు. (Donation to Police academy)

ఇక తేజ్‌ సినిమా విషయానికొస్తే.. ఈ ఏడాది 'విరూపాక్ష’ , బ్రో’ చిత్రాలతో సూపర్‌హిట్‌ అందుకున్నారు. తాజాగా ఆయన సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ చూస్తుంటే తేజ్‌ ఇప్పటి దాకా చేయని ఊరమాస్‌ పాత్రలాగా అనిపిస్తోంది. ఇటీవల ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో సైనికుడిగా నటించిన విషయం తెలిసినదే.

Updated Date - 2023-10-16T10:52:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!