Sai Dharam Tej: గురు శిష్యులకు బాగా కుదిరిందిరా అన్నారు!
ABN, First Publish Date - 2023-07-27T12:33:50+05:30
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) తనకు మేనమామ అయినా గురువుగా భావిస్తారు సాయిధరమ్‌తేజ్ (Sai dharamtej). చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంది. తేజ్ చిన్నతనంలో పవన్‌తోనే ఎక్కువ గడిపేవాడినని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడీ మామ-అల్లుళ్లు, గురు శిష్యులు కలిసి ‘బ్రో’ (Bro) చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) తనకు మేనమామ అయినా గురువుగా భావిస్తారు సాయిధరమ్‌తేజ్ (Sai dharamtej). చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంది. తేజ్ చిన్నతనంలో పవన్‌తోనే ఎక్కువ గడిపేవాడినని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడీ మామ-అల్లుళ్లు, గురు శిష్యులు కలిసి ‘బ్రో’ (Bro) చిత్రంలో నటించారు. సముద్రఖని దర్శకత్వంలో జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘నేను నటుణ్ణి కావడానికి మా మావయ్య పవన్‌కల్యాణ్ కారణం. నేను గురువులా భావించే ఆయనతో నటించే అవకాశం రావడం నాకెంతో ప్రత్యేకం. అందుకే కథ వినకుండా సినిమా చేశా. ఇది నాకు నేను ఇచ్చుకునే కానుకగా భావించి పనిచేశా. ప్రస్తుతం ఆయన సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. ఆ పనులు చూసుకుంటూనే ఈ సినిమా చేశారు. బయట ఎంత ఒత్తిడి ఉన్నా సరే, సెట్‌కి అడుగు పెడితే చేస్తున్న పాత్రే ఆయన ప్రపంచం. బయట ఎన్ని పనులున్నా సరే, చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది ఇవ్వడం ఎలాగో ఆయన్ను చూస్తూ నేర్చుకున్నా. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్నీ ఎలా వేరు చేసి చూడాలో తెలుసుకున్నా. ఈ సినిమా చిత్రీకరణ ఎంత వేగంగా జరిగినా ఎక్కడా ఒత్తిడి అనిపించలేదు. మావయ్యలతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కోరిక. పవన్‌కల్యాణ్‌గారితో ‘బ్రో’ చేశా. నాగబాబు మావయ్యతో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’లో స్ర్కీన్ షేర్ చేసుకున్నా. ఇక పెద్ద మావయ్య చిరంజీవిగారితో కలిసి సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నా. మంచి కథ కుదిరితే మా ఇంటి హీరోలు కాకుండా నాకు ఇష్టమైన రవితేజ, ప్రభాస్ కల్యాణ్‌రామ్, తారక్, మంచు మనోజ్‌లతో కలిసి నటిస్తా. కల్యాణ్ మావయ్య కలిసి నటించే అవకాశం రావడం పట్ల ఇంట్లో అందరూ సంతోషించారు. అది నా అదృష్టం. చిరంజీవి (Chiranjeevi)మావయ్య అయితే ‘మీ గురు శిష్యులకి బాగా కుదిరిందిరా’ అన్నారు.