సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sai Dharam Tej: తాగి వచ్చావా.. మాట పోయిందా? అని జోకులు వేశారు.

ABN, First Publish Date - 2023-04-02T19:14:57+05:30

ప్రమాదంలో గాయాలై మంచాన పడ్డ నాపై ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే ‘నీ పనైపోయిందా, రిటైర్‌మెంట్‌ తీసుకున్నావా? అంటూ జోకులు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదంలో గాయాలై (Sai tej Accident) మంచాన పడ్డ నాపై ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే ‘నీ పనైపోయిందా, రిటైర్‌మెంట్‌ తీసుకున్నావా? అంటూ జోకులు వేశారు. నేనేమైనా కావాలని గ్యాప్‌ తీసుకున్నానా? యాక్సిడెంట్‌ అవడం వల్ల నా కెరీర్‌కు బ్రేక్‌ పడింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మెగా మేనల్లుడు సాయితేజ్‌ (Sai tej). 2021 సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. తాజాగా ఆయన నటించిన ‘విరూపాక్ష’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పరిస్థితి తెలిసి కూడా ఎంతోమంది కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. (Virupaksha on 21 april)

''ప్రమాదంతో మంచాన పడ్డా నేను పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే ‘నీ పనైపోయిందా, రిటైర్‌మెంట్‌ తీసుకున్నావా? అంటూ జోకులు వేశారు. నేనేమైనా కావాలని గ్యాప్‌ తీసుకున్నానా? యాక్సిడెంట్‌ అవడం వల్ల నా కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఆ సమంలో నేను ఖాళీగా లేను. పుస్తకాలతో స్నేహం చేశా. బొమ్మలతో ఆడుకునేవాడిని. కానీ ఈ ప్రమాదం వల్ల నాకు మాట విలువ బాగా తెలిసింది. ఎప్పుడు లొడలొడా వాగే నాకు యాక్సిడెంట్‌ వల్ల ఒక్కసారిగా మాట పడిపోయింది. జనాలేమో వీడు తాగేసి (netizens Comment on Sai tej) మాట్లాడుతున్నాడంటూ జోక్‌ చేశారు. కానీ గొంతు పెగిలి మాట రావడం లేదని ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అప్పుడు మాట విలువ నాకు బాగా తెలిసొచ్చింది. ఆ సమయంలో నా చుట్టుపక్కల వాళ్లు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. నేను చెప్పేది అర్థం కాకపోతే.. నాన్న అర్థం అవలేదు, మళ్లీ చెప్పు అనేవారు. రిపబ్లిక్‌లో చిత్రంలో నాలుగు పేజీల డైలాగ్‌ అవలీలగా చెప్పిన నాకు సగం పేజీ డైలాగ్‌ చెప్పడానికి కూడా నోరు తిరగలేదు. నా తోటి యాక్టర్లు చాలా సపోర్ట్‌ చేశారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం మందు తాగి వచ్చావా? మాట పోయిందా? అని జోకులు వేశారు. కానీ ఇవేమీ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు’ అని చెప్పారు.

తాజాగా ఆయన నటించిన ‘విరూపాక్ష’ ఈ నెల 21 విడుదల కానుంది. సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిసున్నారు. కార్తిక్‌ వర్మ దండు దర్శకుడు.

Updated Date - 2023-04-02T19:23:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!