సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sai Dhanshika: ‘అంతిమ తీర్పు’కు సిద్ధమైన సూపర్ స్టార్ కుమార్తె

ABN, First Publish Date - 2023-02-24T20:11:44+05:30

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటించిన ‘కబాలి’ (Kabali) చిత్రంలో టాలెంటెడ్ నటి సాయి ధన్సిక (Sai Dhanshika).. ఆయన కుమార్తెగా నటించిన

Anthima Teerpu Movie Title Launch
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటించిన ‘కబాలి’ (Kabali) చిత్రంలో టాలెంటెడ్ నటి సాయి ధన్సిక (Sai Dhanshika).. ఆయన కుమార్తెగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమెను సూపర్ స్టార్ కుమార్తెగానే అంతా సంబోధిస్తున్నారు. ఇప్పుడీ టాలెంటెడ్ నటి ‘అంతిమ తీర్పు’ (Anthima Teerpu)కు సిద్ధమైంది. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి (Amit Tiwari) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఏ. అభిరాం (A Abhiram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి. రాజేశ్వరరావు (D Rajeswara Rao) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో అమిత్ తివారి మాట్లాడుతూ.. ఈ సినిమా నిమిత్తం ప్రొడ్యూసర్‌గారిని కలిసినప్పుడు ఆయన‌లో ఒక ప్యాషన్ చూసాను. ఒక మంచి సినిమా తీయాలనే తపన ఆయనలో నాకు కనిపించింది. డి.రాజేశ్వరరావు వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. షూటింగ్ చాలా హెల్దీగా జరిగిందని తెలిపారు. హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ... ఒక సినిమాకు సపోర్ట్ ఇచ్చేది కేవలం మీడియా వాళ్లే. మీడియాకు థ్యాంక్స్. ఈ సినిమాలో చేసిన వారందరికీ మంచి పాత్రలు దక్కాయి. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరం అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నామని అన్నారు. (Anthima Teerpu Title Launch)

డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ.. ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య‌గారి చాలా సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఇందులో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. మిగతవారు కూడా చాలా మంచి పాత్రలు చేశారు. కోటి‌గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నిర్మాత డి. రాజేశ్వరరావు‌గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

*********************************

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T20:12:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!