సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Navdeep: ‘సగిలేటి కథ’లో అందుకే భాగమయ్యా

ABN, First Publish Date - 2023-08-01T15:29:02+05:30

నవదీప్‌ సి- ేస్పస్‌ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకుడు. అశోక్‌ ఆర్ట్స్‌, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నవదీప్‌ విడుదల చేశారు.

నవదీప్‌ (Navdeep) సి- స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’(Sagileti Katha). రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకుడు. అశోక్‌ ఆర్ట్స్‌, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నవదీప్‌ విడుదల చేశారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సమర్పకుడు నవదీప్‌ మాట్లాడుతూ.. ఇటీవల ‘సగిలేటి కథ’ చిత్రం చూశా. అప్పుడే ఈ చిత్రంలో భాగం కావాలనుకున్నా. దర్శకుడు మల్టిపుల్‌ క్రాఫ్ట్‌లను నిర్వహించడం ముచ్చటేసింది. కొంతమంది దర్శకులు మాత్రమే మంచి నటనని రాబట్టగలరు. ‘సగిలేటి కథ’లో రాజశేఖర్‌ కొత్త ఆర్టిస్టుల నుంచి మంచి కామెడీని రాబట్టారు. ఇలాంటి సినిమా సపోర్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని నవదీప్‌ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు ప్రతి క్రాఫ్ట్‌లో చక్కగా తన ప్రతిభ చూపించారు. ట్రైలర్‌కు స్పందన బావుంది. ‘బలగం’ తరహాలో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

దర్శకుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘సగిలేటి కథ’ అనే నవల ప్రేరణతో అతి తక్కువ బడ్జెట్‌తో సినిమా తీశాం. ‘రచ్చ’లో తమన్నాలాగా హీరోయిన్‌ విషిక నటించింది. ఈ సినిమాలో రుచికరమైన కోడి మాంసం తినాలనేది ఒక కీలక పాత్ర లక్ష్యం. అందుకే కోడి కేంద్రంగా ఉంటుంది. కానీ, కథ అంతకు మించినది. సినిమాలో మంచి సర్‌ప్రైజ్‌లున్నాయి’’ అని అన్నారు.

‘‘రవితేజగారి స్ఫూర్తితో వచ్చాను. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభి నటుడినయ్యా. దర్శకుడు నాపై నమ్మకం పెట్టారు. 40 రోజులపాటు ఓ గ్రామంలో చిత్రీకరింణ చేశాం. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని రవి మహాదాస్యం అన్నారు.

Updated Date - 2023-08-01T15:43:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!