కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muttiah Muralitharan : బయోపిక్‌ కోసం గ్రాండ్‌ ఈవెంట్‌..

ABN, First Publish Date - 2023-09-04T12:51:21+05:30

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌, లెజెండరీ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. (800 Movie) మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌, మది మలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటిస్తున్నారు.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌, లెజెండరీ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (Muttiah Muralitharan Biopic) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. (800 Movie) మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌, మది మలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటిస్తున్నారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్‌ ప్రైజ్‌ (2022) పురస్కార గ్రహీత షెహన్‌ కరుణతిలకతో కలిసి ఆయన స్ర్కిప్ట్‌ అందించారు. సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) ముఖ్య అతిథిగా సెప్టెంబర్‌ 5న ముంబైలో ‘800’ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు మేకర్స్‌ పూర్తి చేశారు. ఇటు సచిన్‌ ఇండియా తరఫున, అటు మురళీధరన్‌ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. మైదానంలో పోటీ పడినప్పటికీ... బయట మాత్రం ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంతోనే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయడానికి సచిన్‌ అతిథిగా హాజరు కానున్నారు. ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ (Sivalenka Krishna Prasad) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ విడుదల తర్వాత ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శివలెంక కృష్ణ ప్రస?ద్‌ మాట్లాడుతూ ‘’సచిన్‌ టెండూల్కర్‌ ‘800’ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతోపాటు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు.

Updated Date - 2023-09-04T12:51:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!