RRR Remake: ఆర్‌ఆర్‌ఆర్ హిందీ రీమేక్.. టీమ్ ఎవరంటే!
ABN, First Publish Date - 2023-04-25T13:06:34+05:30
రాజమౌళి (SS rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అందుకొని తెలుగు సినిమా సత్తా చాటింది.
రాజమౌళి (SS rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అందుకొని తెలుగు సినిమా సత్తా చాటింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ (RRR Hindi Remake) అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టెక్నికల్ వరల్డ్‌లో సంచలనంగా మారిన చాట్‌జీపీటీ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ రీమేక్ గురించి జవాబు రాబట్టే పనిలో పడ్డారు పలు రంగాల వారు. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ రీమేక్ చేయాల్సి వస్తే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరైతే బావుంటుంది.. నటీనటులెవరు? అని చాట్‌జీపీటీని (Chatgpt about RRr remake) ప్రశ్నించారు నెటిజన్లు. దానికి చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా...?
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో బ్రిటీష్‌వారిపై పోరాడిన యోధుడిగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటన జనాల్ని కట్టిపడేసింది. బాలీవుడ్ నుంచి ఆ పాత్రకు ఒదిగిపోయే నటుడు రణ్‌వీర్‌సింగ్ లేదా సిద్థార్థ్ మల్హోత్ర కరెక్ట్‌గా సరిపోతారని ఛాట్‌జీపీటీ చెప్పింది. బ్రిటిష్ గవర్నర్ చెర నుంచి మల్లినని కాపాడిన కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మదిని దోచింది. ఆ పాత్రకు చాట్‌జీపీటీ.. విక్కీ కౌశల్ , రాజ్‌కుమార్ రావు పర్ఫెక్ట్‌గా సూటవుతారని సూచించింది.
అలియాభట్ పోషించిన సీత పాత్రకు హిందీ వెర్షన్‌లో శ్రద్థా కపూర్, కృతిసనన్ నప్పుతారని చాట్‌బాట్ జబాబిచ్చింది. అజయ్ దేవగణ్ పాత్రకు సంజయ్ దత్, అనిల్ కపూర్, శ్రియ స్థానంలో దీపికా పడుకోన్ పేర్లను వినిపించింది కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరంటే.. రాజమౌళిలా ఆ సినిమాకు న్యాయం చేయాలంటే సంజయ్‌లీలా భన్సాలీ పేరు సూచించింది.