సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MM. Keeravani: ఆస్కార్ అనంతరం తొలిసారి పోస్ట్!

ABN, First Publish Date - 2023-03-15T20:39:43+05:30

ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ అవార్డు(Oscars95) ను కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) పురస్కారాన్ని అందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ అవార్డు(Oscars95) ను కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) పురస్కారాన్ని అందుకుంది. అకాడమీ పురస్కారాన్ని ఎమ్‌ఎమ్. కీరవాణి (MM. Keeravani), చంద్రబోస్ (Chandrabose) స్టేజ్‌పై అందుకున్నారు. సినీ ప్రపంచలోనే విశిష్ఠంగా భావించే అవార్డును అందుకోవడంతో కీరవాణి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ప్రియమైన భారతీయులరా.. మీ మద్దతుతో అట్లాంటిక్ జాలాల సరిహద్దులను క్రాస్ చేశాం. లోపలి అగ్నిని సజీవంగా ఉంచాం. ‘ఆర్ఆర్ఆర్’ అంటే నాకు ప్రపంచం. కానీ, ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్’ అంంటే స్వ స్థలానికి తిరిగి రావడం. మీ ప్రేమాభిమానాలను అందుకోవడం. ఆస్కార్ ప్రయాణంలో మీరు అందించిన ప్రేమ, మద్దతు అద్భుతమైనవి. అందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని కీరవాణి తెలిపారు. అంతకు ముందు ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలోనే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

విప్లవ కారులైన అల్లూరి సీత రామ రాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో ‘ఆర్ఆర్ఆర్’ లను రూపొందించారు. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘నాటు నాటు’ పాటను కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫ్ చేశారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Deepika Padukone: మెడపై వేయించుకున్న ‘82°E’ టాటూకు అర్థమిదే!

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Updated Date - 2023-03-15T20:39:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!