సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MM. Keeravani: ఆస్కార్ విన్నర్ అని పిలిస్తే పనిని తక్కువ చేసినట్టవుతుంది

ABN, First Publish Date - 2023-03-25T20:44:07+05:30

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డును అందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డును అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి (MM. Keeravani), గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ వేదికపై ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డును అందుకున్న అనంతరం కీరవాణి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘నాటు నాటు’ వెనుక ఉన్న ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘‘సినిమాలోని ‘నాటు నాటు’ ఒక మాస్‌ సాంగ్‌. డ్యాన్స్‌ చేయాలనిపించే సాంగ్‌. టెక్నికల్‌గా మాట్లాడితే ప్రతిభను చూపించడానికి వీలుండే, శాస్త్రీయ సంగీతం, గొప్ప కవిత్వంకు ఆస్కార్‌ అవార్డులు వస్తాయని అందరు ఆశించవచ్చు. అయితే, ‘నాటు నాటు’ అద్భుతమైన కమర్షియల్‌ సాంగ్‌. ఫాస్ట్‌ బీట్‌ నంబర్‌. అకాడమీ అవార్డు సంగతి పక్కన పెట్టండి. అసలు అవార్డు వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కొరియోగ్రఫీ వల్లే ‘నాటు నాటు’ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ పాటలో సినిమా కథ కూడా ఉంటుంది. జాతి వివక్షను చర్చించారు. స్టెప్స్ వల్ల ‘నాటు నాటు’ విపరీతంగా వైరల్‌ అయింది. ఈ క్రెడిట్‌ మొత్తం రాజమౌళి, ప్రేమ్‌ రక్షిత్‌, చంద్రబోస్‌లకు దక్కుతుంది. గోల్డెన్‌ గ్లోబ్‌‌ను అందుకుంటున్నప్పుడే ఈ విషయాన్ని చెప్పాను. తమిళ్‌, మలయాళం, హిందీల్లో కూడా ఈ పాట చేశాం. కానీ, తెలుగు పాటనే ఆస్కార్‌కు రిజిస్టర్‌ చేశాం. ఈ విషయంలో చంద్రబోస్‌ అదృష్టవంతుడు. తెలుగు వెర్షన్‌ రిథమిక్‌గా ఉండటంతో పాటు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇతర భాషా రచయితలు కూడా తమ వంతు కృషి చేశారు. ఆస్కార్‌ అనేది చాలా పెద్ద పేరు. ప్రజలు దాన్ని ట్యాగ్‌ చేస్తుంటారు. ఆయన ఆస్కార్‌ విన్నర్‌ అంటూ పిలుస్తారు. ఆ విధంగా పిలవడం మొదట్లో ఒకట్రెండుసార్లు బాగానే ఉంటుంది. ప్రతిసారీ అలా పిలుస్తుంటే దానికేం విలువ ఉంటుంది. ఆ విధంగా పిలిస్తే చేసే పనిని తక్కువ చేసినట్టు అవుతుంది’’ అని కీరవాణి చెప్పారు.

‘ఆర్ఆర్ఆర్’ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియో మోరిస్, రే స్టీవెన్సన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్‌ఆర్’ మార్చి 25న తో విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. జపాన్‌లోను సంచలనం సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-25T20:47:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!