InCar: నెల రోజులు రితిక స్నానం ఎందుకు చెయ్యలేదో తెలుసా...
ABN, First Publish Date - 2023-02-25T15:21:50+05:30
అత్యాచారంకు సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్ లైన్స్ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటుంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్ కార్
దర్శకుడు హర్ష వర్ధన్ (#HarshaVardhan) ‘ఇన్ కార్’ (#InCar) ఒక థ్రిల్లర్ సినిమా తీశారు. ఇందులో రితిక సింగ్ (#RitikaSingh) ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తీశామని చిత్ర దర్శకుడు, అలాగే రితిక సింగ్ కూడా చెప్తున్నారు. అత్యాచారంకు సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్ లైన్స్ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటుంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్ కార్ రూపొందించాం, అని చెప్పారు. శారీరక హింసే కాదు మహిళలని మానసికంగా ఎలా హింసకు గురౌతుందో కూడా ఇందులో చూపించాం. రితిక సింగ్ చాలా బాగా నటించారు అని దర్శకుడు ఆమెకి కితాబుని కూడా ఇచ్చాడు. ఈ సినిమాతో తప్పకుండా ఆమెకు మరో జాతీయ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది అని హర్ష వర్ధన్ అంటున్నాడు.
మార్చి 3 న విడుదల అవుతున్న ఈ సినిమా గురించి రితిక సింగ్ చాలా గొప్పగా మాట్లాడింది. ఈ ‘ఇన్ కార్’ (#InCar) సినిమా చాలా సీరియస్, కంప్లీట్ రా సినిమా అని అంటూ, ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు తాను చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఫీల్ అయ్యానని చెప్తోంది. అలాగే ఈ సినిమా చేయటం వలన చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే తాను చేసే పాత్ర చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్ర అని చెప్తోంది. ఈ సినిమా కథ విన్నప్పుడే ఇందులో నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని రితిక కి తెలుసు అందుకే ఈ పాత్ర చేశాను అంటోంది. (#RitikaSingh)
ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ తాను చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర చేశాను అని చెప్తోంది. కొన్ని సీన్లు చేస్తున్నపుడు సెట్ లో వున్నా సినిమా యూనిట్ సభ్యులు చాలామంది ఏడ్చేసేవారు, అని చెపింది. అందరూ చూడాల్సిన సినిమా ఇది, అందరికీ రీచ్ అవుతుందనే నమ్మకం వుంది అని అంటోంది.
ఎందుకంటే ఇందులో ఎంచుకున్న సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్ అని చెప్తోంది. దాదాపు షూటింగ్ అంతా కూడా ఒక కార్ లో చేశారట. ఈ కథకు కంటిన్యూటీ చాలా ముఖ్యం, అందుకని ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ రితిక తలకి స్నానం చేయలేదు అని చెప్తోంది. "‘ఇన్ కార్’ రియల్, డిస్టర్బింగ్ ఫిల్మ్. కానీ చివర్లో ఒక గొప్ప హోప్ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్ కార్’ ని తప్పకుండా చూడాలి’’ అని రితిక అన్నారు. (#InCar)