RGV Saaree: అన్నంత పని చేసిన ఆర్జీవి .. ఆ నటితో ‘స్టాకింగ్ సిండ్రోమ్’ నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్
ABN, Publish Date - Dec 21 , 2023 | 03:41 PM
రామ్ గోపాల్ వర్మ అన్నంత పని చేశాడు. ఆ మధ్య సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి ఫోటోకు ఫిదా అయిన ఆర్జీవి అ ఆమ్మాయిని కథానాయికగా పరిచేయం చేస్తూ ఈ రోజు (గురువారం) సినిమా టైటిల్‌ను, నేపథ్యాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అన్నంత పని చేశాడు. ఆ మధ్య సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి ఫోటోకు ఫిదా అయిన ఆర్జీవి అ ఆమ్మాయి ఎవరో, ఆడ్రస్ కావాలంటూ ట్వీట్ చేయడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. తర్వాత అమ్మాయిని కనిపెట్టిన ఆర్జీవి ఆమెతో శారీ అనే సినిమా తీస్తానంటూ చెప్పి ఇప్పుడు ఆ పని కూడా చేసేశాడు. తన దృష్టిలో పడిన శ్రీలక్ష్మీ సతీష్ అనే కేరళ కుట్టిని కథానాయికగా పరిచేయం చేస్తూ ఈ రోజు (గురువారం) సినిమా టైటిల్‌ను, నేపథ్యాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అయితే ఆయన ఈ సారి దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఆర్జీవీ డెన్ బ్యానర్ పై శ్రీలక్ష్మీ సతీష్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేసిన అగోష్ వైష్ణవమ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం గమనార్హం. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘శారీ’ (అతి ప్రేమ చాలా డేంజర్‌గా మారొచ్చు) (RgvsSaaree) అనే టైటిల్ ప్రకటించారు. అంతర్జాతీయ శారీ డే (International Saaree Day) సందర్భంగా ఆర్జీవి డెన్ నుంచి మా ఈ శారీ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం చాలా ఎగ్జైట్‌గా ఉందంటూ ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా కనిపించే స్టాకింగ్ సిండ్రోమ్ నేపథ్యంలో ఈ ‘శారీ’ (RgvsSaaree) సినిమాను తీస్తున్నామని, స్త్రీలపై పురుషుడికి ఉండే విపరీతమైన వ్యామోహం చాలా ప్రమాదాలకు దారి తీస్తున్నదనే ఇతివృత్తంలో చిత్రం ఉంటుందని ఆర్జీవి (Ram Gopal Varma) తెలిపారు. అయితే ఈ సినిమా నుంచే శ్రీలక్ష్మీ సతీష్ పేరును వాళ్ల కుటంబ సభ్యుల సమక్షంలోనే ఆరాధ్య దేవిగా మారుస్తూ నిర్ణయం తీసకున్నారు. ఇకపై స్క్రీన్ నేమ్‌గా ఇదే కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు.
అయితే గతంలోనూ రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇలానే ఓ ఆర డజను సినిమాలు ప్రకటించి ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు లేవు. నిత్య వివాది,రోజుకో గొడవ, వారానికో వివాదంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ చేయి పెట్టిన ప్రతీ సినిమా సెన్సార్ కన్నా ముందు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం, టీవీల్లో పంచాయతీలు పెట్టడం, సోషల్‌మీడియాల్లో ట్వీట్లతో రచ్చ చేయండం అనవాయితీగా మారిన క్రమంలో ఇప్పుడు ఈ ‘శారీ’ అనే సినిమా ఎంత పెంట పెడుతుందో అని చాలా మంది ముందే అంచనా వేసుకుంటున్నారు. కొద్ది రోజులు ఆగితేనే గానీ తెలియదు.