కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tiger Nageswararao : హేమలత లవణం ఏం చేయబోతోంది?

ABN, First Publish Date - 2023-10-01T17:37:43+05:30

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు’. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. పాన్  ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది.

మాస్‌ మహారాజా రవితేజ (Ravi teja) హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు’. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. పాన్  ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, చార్ట్‌బస్టర్‌ పాటలతో టైగర్‌ నేషనల్‌ వైడ్‌ గా హ్యూజ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తుందీ సినిమా. (Hemalatha lavanam)

ఈ చిత్రంలో రేణుదేశాయి (renu desai) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా వుంది. అక్టోబర్‌ 3న ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్‌ చేయనున్నారు. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు చార్ట్‌ బస్టర్‌ రెస్పాన్స వచ్చింది. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-10-01T17:41:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!