సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Renu Desai: మీ అన్న కొడుకు కాదు.. నా బిడ్డ వాడు!

ABN, First Publish Date - 2023-04-09T11:27:18+05:30

రేణుదేశాయి పవన్‌కల్యాణ్‌ అభిమానులపై ఫైర్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు పంపిన మెసేజ్‌లపై ఆమె మండిపడ్డారు. శనివారం అకీరానందన్‌ 19వ పుట్టినరోజు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణుదేశాయి (Renu desai) పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)అభిమానులపై ఫైర్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు పంపిన మెసేజ్‌లపై ఆమె మండిపడ్డారు. శనివారం అకీరానందన్‌ 19వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేణుదేశాయి ఓ వీడియో పోస్ట్‌ చేసి నా బిడ్డకు 19 ఏళ్లు వచ్చినా నాకు పసి బిడ్డే అని రాసుకొచ్చారు. అకీరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా హీరోలతోపాటు పలువురు అభిమానులు అకీరాకు (Akhiranandan) బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. అందులో కొందరు ఫ్యాన్స్‌ మాత్రం ఇరిటేట్‌ అయ్యేలా ప్రవర్తించడంతో రేణు దేశాయ్‌ తన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మేడమ్‌.. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి మా అన్న (పవన్‌ కల్యాణ్‌) కొడుకును చూడాలని మాకు ఉంటుంది. దయచేసి మీరు హైడ్‌ చేయకండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మెసేజ్‌లు (Pawan kalyan Fans) చేశారు. అప్పుడప్పుడు అయినా అకీరా బాబును వీడియోల్లో చూపించండి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. (Renu desai Fire)

దీనికి రేణు దేశాయ్‌ బదులిస్తూ.. ‘మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ అని నాకు తెలుసు. కాకపోతే కొంచెం మాట్లాడే పద్థతి నేర్చుకోండి. చాలా వరకూ మీ అభిమానాన్ని అర్థం చేసుకుని ఏమీ మాట్లాడలేకపోతున్నా. కొన్ని మెసేజ్‌లు డిలీట్‌ చేస్తున్నా. అయినా కొందరు హద్దు దాటి మాట్లాడుతున్నారు. నా ఇన్‌స్టా పేజ్‌కి వచ్చిన ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. కనీసం అకీరా బర్త్‌డే రోజున కూడా నెగటివ్‌ కామెంట్స్‌ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్‌ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇన్నేళ్లగా ఓర్పుగా ఓ తల్లిగా నేను అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓ తల్లి చాలా హర్ట్‌ అవుతున్నా. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయాను. అసలు ఈ జనాల సమస్య ఏంటో అర్థం కావడం లేదు’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయి ఇప్పుడు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం కీలక పాత్ర పోషించారు.

Updated Date - 2023-04-09T11:33:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!