కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Renu Desai Counter : అంకుల్‌.. డబ్బు కోసం దిగజారొద్దు...

ABN, First Publish Date - 2023-12-09T20:51:17+05:30

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి వదంతులు సృష్టించే పలువురిని ఉద్దేశించి రేణు దేశాయి (Renu Desai) సుదీర్ఘ పోస్ట్‌ చేసింది. సెలబ్రిటీల జీవితాలపై ఫోకస్‌ చేయడం జర్నలిజం కాదని హితవు పలికింది.

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి వదంతులు సృష్టించే పలువురిని ఉద్దేశించి రేణు దేశాయి (Renu Desai) సుదీర్ఘ పోస్ట్‌ చేసింది. సెలబ్రిటీల జీవితాలపై ఫోకస్‌ చేయడం జర్నలిజం కాదని హితవు పలికింది. ఇటీవల ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రేణూ దేశాయ్‌ నటిగా రీఎంట్రీ ఇచ్చారు. దీనిపై ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ రేణూ వ్యక్తిగత విషయాలపై అనుచితంగా మాట్లాడారు. ఆ వీడియో క్లిప్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు రేణూ. ఈ సందర్భంగా గతంలో తాను సాధించిన విజయాలను గుర్తుచేశారు. మహిళలను తక్కువగా చూడడం తగదని చెప్పారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడటం సరికాదంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. (Renu Desai Fire on Immandi Ramarao)

ఇంతకీ ఆమె చేసిన పోస్ట్‌లో ఏముంది అంటే..

నటీనటులు, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం ఎంత వరకూ కరెక్ట్‌? సమాజం, శాంతి భద్రతలకు సినీ తారల జీవితం విఘాతం కలిస్తుందా? ఓ సినిమా విడుదలైతే సినీ విశ్లేషకులు, విమర్శకులు ఆయా చిత్రాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. వాళ్లిచ్చే ఒపీనియనను భావ ప్రకటన స్వేచ్ఛగా మేం తీసుకుంటాం. కానీ, మా జీవితాల గురించి మాట్లాడటం మంచిది కాదు’’ అని రాసుకొచ్చారు. ‘‘యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా ఖాళీగా కూర్చొన్న ప్రతి ఒక్కరూ మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక కలిగిన వ్యక్తులందరూ.. పుస్తకాలు, పాటలు రాయడం, పెయింటింగ్స్‌ గీయడం, సినిమాలు తీయడం మానేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సృజనాత్మక కలిగిన వారు ఎంతో సున్నితంగా ఉంటారు. నటన, సంగీతం, డ్యాన్స్‌, పెయింటింగ్స్‌ వేయడం ఇలా.. పలు విధాలుగా తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. అందరిలాగే వ్యక్తిగత జీవితంలో మాక్కూడా కొన్ని సమస్యలుంటాయి. ప్రేమ పొందిన క్షణాలు, మనసు ముక్కలైన సందర్భాలు ఉన్నాయి. మా జీవితాల్లో మేమూ కొన్ని తప్పులు చేస్తాం. అయితే, కొంతమంది మా బాధ నుంచి లబ్థి పొందడం ఏమాత్రం నైతికత కాదు. బ్రేకప్‌ లేదా విడాకులు తీసుకోవడం నేరం కాదు. నా జీవితం గురించి నేనే స్వయంగా మాట్లాడటం పూర్తిగా నా ఇష్టం. కానీ, సెలబ్రిటీల జీవితాలపై కొంతమంది ఇలాంటి వదంతులు సృష్టించడం ఏమాత్రం గౌరవంప్రదం అనిపించుకోదు. అలాంటి వదంతుల గురించి నేను వివరణ ఇచ్చుకోగలను. కానీ, నేను చెప్పాలనుకుంది మాత్రం ఒక్కటే. వేరేవాళ్లకు ఎదురైన సమస్యల గురించి మాట్లాడి డబ్బులు సంపాదించడం మంచి కర్మ కాదు’’ అని రేణూ దేశాయి పేర్కొన్నారు.

వయసు మీరింది.. రామా.. కృష్ణా అనుకోండి!

"అంకుల్‌.. నేను ఎవరి నామం జపిస్తున్నానో మీకు అనవసరం. కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో ఏడు నిమిషాల వ్యవధిలో 13సార్లు నా నామ జపం చేసి వ్యూస్‌ సంపాదించుకున్నారు. ఆ విషయంలో నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకుంటున్నారు. మీ ప్రతిభతో మాట్లాడి సంపాదించుకుని తింటే అది మీకు మంచిదే! కానీ సింపుల్‌ ఓ కుర్చీలో కూర్చుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి గాసిప్స్‌ క్రియేట్‌ చేసి సంపాదించిన సొమ్ము మీకు ఒంటికి అంత మంచిది కాదు. ఇకపై జీవితంలో మీకున్న సమయాన్ని సేవా కార్యక్రమాల కోసమో, దైవ నామస్మరణకో ఉపయోగించండి. ఇంత వయసు వచ్చినా తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తోంది. మహిళలను దుర్గమాతగా, కాళీమాతగా చూసే సంస్కృతి మనది. కానీ మీలాంటి వారు మాత్రం ప్రతి విషయంలో మగాడితో లింక్‌ చేసి మహిళలను కించపరుస్తున్నారు. అది సరైన పద్దతి కాదు’’ అని మండిపడ్డారు.

Updated Date - 2023-12-09T20:51:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!