సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ravi teja: ఈసారైనా జానర్‌ మారుస్తాడా?

ABN, First Publish Date - 2023-07-09T14:16:00+05:30

మాస్‌ మహారాజా రవితేజ్‌, గోపీచంద్‌ మలినేనిలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ వంటి మూడు హిట్‌ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్‌ మహారాజా రవితేజ్‌ (Ravi teja), గోపీచంద్‌ మలినేనిలది(Gopi chand) సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ (Krack) వంటి మూడు హిట్‌ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. మైత్రి మూవీస్‌ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బ్లాక్‌బస్టర్‌ హ్యాట్రిక్‌ తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ క్రియేట్‌ చేయడానికి నాలుగోసారి హిట్‌ కాంబో రెడీ అవుతోంది’’ అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలె త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. రవితేజ , గోపీచంద్‌ కాంబోలో వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ మూడూ మాస్‌ యాక్షన్‌ చిత్రాలే. మరి ఈసారి ఏ జానర్‌ ఎంచుకున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే!

ప్రస్తుతం రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (tiger nageswararao) చిత్రంతో బిజీగా ఉన్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 1970 నేపథ్యంలో సాగే ఈ చిత్రం రవితేజకు తొలి ప్యాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. 18 ఏళ్ల విరామం తర్వాత రేణూ దేశాయ్‌ ఈ చిత్రంతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-07-09T14:16:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!