కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dil Raju : దిల్ రాజు నిర్మాణంలో..  రవి కిరణ్ కోలా సినిమా 

ABN, First Publish Date - 2023-09-26T13:06:39+05:30

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఎప్పుడూ ముందుంటారు.

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు (Dil raju), శిరీష్ ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. 'రాజావారు రాణిగారు' దర్శకుడు రవి కిరణ్ కోలాతో (Ravi kiran kola) దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్నీ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

'రాజావారు రాణిగారు' సినిమా తర్వాత 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకు షోరన్నర్‌గా వ్యవహరించిన రవి కిరణ్ కోలా మరోసారి మెగా ఫోన్ పట్టనున్నారు. మరో వైవిధ్యమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించటానికి దిల్ రాజు, శిరీష్, రవి కిరణ్ కోలా సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-09-26T13:06:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!