Ravanasura: ఓటిటి లోకి ముందుగానే వచ్చేస్తొందోచ్ ! ఎప్పుడంటే...
ABN, First Publish Date - 2023-04-17T15:10:20+05:30
ఎంత పెద్ద సినిమా అయినా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడితే తొందరగానే ఓటిటి లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు రవి తేజ నటించిన 'రావణాసుర' పరిస్థితి కూడా అంతే. అయితే ఇది అనుకున్న తేదీ కన్నా ముందుగానే వచ్చేస్తోంది.
సీనియర్ నటుడు రవితేజ (Ravi Teja), దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తో కలిసి రూపొందిన చిత్ర 'రావణాసుర' (#Ravanasura). ఈమధ్యనే విడుదల కూడా అయింది, కానీ పాపం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇందులో రవితేజ కొంచెం నెగిటివ్ షేడ్స్‌తో కనపడినా, క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోయాడు. ఈ సినిమాకి మొదటి షో నుండి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ సినిమా మీద రవితేజ పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు, అందుకే ఈ సినిమాకి అతను నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ తో ప్రారంభం అయిన ఈ సినిమా వసూళ్లు కూడా దారుణంగా పడిపోయాయి, అందుకని ఈ సినిమా నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమా ఓటిటి (OTT) విడుదల మీద ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఈ ‘రావణాసుర’ (Ravanasura) ఓటిటి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని మే రెండో వారంలో ఓటిటి లో స్క్రీనింగ్ చెయ్యాలి. కానీ ఇప్పుడు థియేటర్ లో ఈ సినిమా తీసేసే పరిస్థితి వుంది కాబట్టి, అనుకున్న తేదీ కన్నా ముందుగానే ఓటీటీ లోకి తీసుకురావాలని నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసింది. మే రెండో వారం లో ఇది రావాలి, కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ సినిమాని ముందుగానే అంటే మే మొదటి వారంలోనే ఓటిటి లో ఉంటుంది అంటున్నారు. మే 5వ తేదీన ‘రావణాసుర’ అమెజాన్ లో ప్రీమియర్ అవుతుందని అంటున్నారు.
రవితేజ తో పాటు అభిషేక్ నామ కూడా దీనికి నిర్మాత. ఇది ఒక బెంగాలీ సినిమా ఆధారంగా రాసిన కథ, కానీ శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) దీనికి కథ అందించాడు అని చెప్తున్నారు. ఇందులో రవితేజని విలన్ లా చూపించి, అతనితో హత్యలు చేయించి, చివరికి ఒక మంచివాడులా ప్రాజెక్ట్ చేసి, ఆ హత్యలు చెయ్యడం వెనకాల ఒక సంఘటన వుంది అన్నట్టుగా చూపించాడు సుధీర్ వర్మ. అది ప్రేక్షకులకి ఎక్కలేదు. ఇందులో సుశాంత్ (Sushanth) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు. ఇందులో చాలామంది కథానాయికలు వున్నా, ఎవరికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర లేదు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల అయింది, కానీ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ప్రకారం విడుదల అయినా ఎనిమిది వారాల తరువాత మాత్రమే ఓటిటి లో వెయ్యాలి, కానీ సినిమా ప్లాప్ అవటం తో నెలరోజుల్లోపే వచ్చేస్తోంది.
ఇది కూడా చదవండి:
Virupaksha: సాయి ధరమ్ తేజ్ సింపతీ వర్క్ అవుట్ అవుతుందా?
Shaakuntalam: మరీ ఇంత ధారుణమా, గుణశేఖర్ కి చాలా పెద్ద దెబ్బ ఇది