Ravanasura: అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి
ABN, First Publish Date - 2023-04-13T15:17:16+05:30
రవితేజ నటించి, నిర్మించిన 'రావణాసుర' గత వారం విడుదల అయింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ...
రవితేజ (Ravi Teja) నటించిన 'రావణాసుర' (Ravanasura) సినిమా గతవారం విడుదల అయింది. సుధీర్ వర్మ (Sudheer Varma) దీనికి దర్శకుడు కాగా, అభిషేక్ నామ (Abhishek Nama) తో పాటు రవితేజ కూడా ఈ సినిమాని నిర్మించారు. ఎంత నమ్మకం లేకపోతే రవితేజ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటాడు. కానీ అతను అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి అయింది.
గత వారం విడుదల అయిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. వీకెండ్ కూడా కొంచెం పరవాలేదు అనిపించినా, సోమవారం నుండి కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. చివరికి సినిమా ప్లాప్ అని తేల్చారు, ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమా క్రిటిక్స్ ని కూడా అంతగా అలరించలేదు. ఎందుకంటే సినిమాలో చాలా లోపాలు ఉన్నాయని అందరూ భావించారు.
అలాగే ఈ సినిమా గురించి రవితేజ తన స్నేహితులతో కూడా చాలా గొప్పగా చెప్పాడని పరిశ్రమలో అంటున్నారు. ఇంతకు ముందు విడుదల అయిన 'ధమాకా' (Dhamaka), 'క్రేక్' (Krack), సినిమాలకన్నా ఈ 'రావణాసుర' (Ravanasura) మంచి సినిమా అని, ఇది కచ్చితంగా ఆడుతుందని తన స్నేహితులకి నమ్మకంగా చెప్పాడు, అలాగే రవితేజ కూడా అంతే నమ్మకంతో నిర్మాత గా కూడా ఈ సినిమాకి అయ్యాడు.
కానీ సినిమా విడుదల అయ్యాక అతను ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. సినిమాలో అసలు లాజిక్ లేకుండా తీసాడు సుధీర్ వర్మ అని అన్నారు ట్రేడ్ అనలిస్టులు. అదీ కాకుండా ఎక్కడా ఆసక్తికరంగా లేదు అని, టైటిల్ 'రావణాసుర' అని పెట్టి రవి తేజ మర్డర్స్ చెయ్యడం వరకు బాగానే తీసాడు. కానీ సుశాంత్ (Sushanth) ప్రియురాలుని గొలుసులతో బంధించి, సుశాంత్ ని బ్లాక్ మెయిల్ చేసిన రవితేజ చివరకి చాలా మంచివాడిగా మారిపోవటం, అతనికి సుశాంత్, అతని ప్రియురాలు సహాయం చెయ్యడం అంత లాజికల్ గా లేదు అనిపించింది అని కూడా అంటున్నారు. ఏమైనా ఈ 'రావణాసుర' సినిమా రవితేజ నమ్మకాన్ని వమ్ము చేసింది. దర్శకుడు సుధీర్ వర్మ మీద రవితేజ చాలా అసలు పెట్టేసుకున్నారు అనిపిస్తుంది.
ఇప్పుడు ఓ.టి.టి, శాటిలైట్ హక్కులు చాలా ఎక్కువగా వున్నాయి కాబట్టి రవితేజ ఆర్థికపరంగా అంతగా నాశం లేకుండా చేసుకోగలదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేసారు.