సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashmika Mandanna: ఈ రోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు

ABN, First Publish Date - 2023-04-05T20:45:10+05:30

సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపును సంపాదించుకున్నారు. రష్మిక ఏప్రిల్ 5న పుట్టిన రోజు జరుపుకొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపును సంపాదించుకున్నారు. రష్మిక ఏప్రిల్ 5న పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో రష్మిక ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన సంతోషాన్ని అభిమానులందరితో పంచుకున్నారు. ఫ్యాన్స్ ను డార్లింగ్ వన్స్ అని సంభోదించారు.

‘‘అందరు సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను. మంచి కలకలం నిలిచి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోజులు, సమయం బాగా లేకపోతే అవి కూడా గడిచిపోతాయి. మీ బాగోగుల గురించి నేను ఆలోచిస్తాను. మీ మంచి, చెడు రోజులు నా మీద ప్రభావం చూపుతాయి. మీరందరు ఎంతగా నానైతే ప్రేమిస్తారో నేను కూడా మిమ్మల్ని అంతగా ప్రేమిస్తాను. నేను ప్రస్తుతం ఈ విధంగా ఉన్నానంటే మీరే కారణం. అందుకు కృతజ్ఞతలు’’ అని రష్మిక తెలిపారు. ‘‘నాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ. ఈ రోజును ప్రత్యేకంగా మార్చారు. ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’’ అని రష్మిక క్యాప్షన్ ఇచ్చారు.

రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. నితిన్‌తో కలసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘వీఎన్ఆర్ ట్రయో’ అని వ్యవహరిస్తున్నారు. కెరీర్‌లోనే తొలిసారిగా హీరోయిన్ సెంట్రిక్ చిత్రం ‘రెయిన్ బో (Rainbow) లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్ బై లింగ్విల్‌గా మూవీ రూపొందనుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-05T22:37:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!