సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashmika mandanna: అందరికీ నచ్చాలని లేదు కదా!

ABN, First Publish Date - 2023-01-07T13:50:02+05:30

ప్రస్తుతం రష్మిక పేరు చెబితే వివాదం అనే మాట గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. దాంతో ట్రోలింగ్‌కు గురైంది. ఆమె పుట్టిన ప్రాంతవాసులే ఆమెపై మండిపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం రష్మిక(Rashmika mandanna) పేరు చెబితే వివాదం అనే మాట గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. దాంతో ట్రోలింగ్‌కు (trolling)గురైంది. ఆమె పుట్టిన ప్రాంతవాసులే ఆమెపై మండిపడుతున్నారు. అంతే కాదు సౌత్‌ ప్రేక్షకులు కూడా ఆమెపై గుర్రుమంటున్నారు. ‘కాంతార’(kanthara comments) హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టిపై ఆమె చేసిన వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. తనని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండో సో కాల్డ్‌ అంటూ ప్రస్తావించడం ఓ కారణం అయితే.. ఇటీవల బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’(Mister majnu) ప్రమోషన్స్‌లో సౌత్‌ ఇండస్ర్టీ పాటలపై ఆమె చేసిన కామెంట్స్‌ మరో కారణం. సౌత్‌ సినిమాల్లో కేవలం మాస్‌ పాటలే ఉంటాయని, రొమాంటిక్‌ సాంగ్స్‌అంటే నార్త్‌లోనే ఉంటాయని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివాదం తర్వాత రష్మికపై దక్షిణాదిలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సౌత్‌లో ఆమెను బ్యాన్‌ చేయాలంటే నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడారు. ‘‘నేను నటిని అయినంత మాత్రాన అందరు నన్ను ఇష్టపడతారని చెప్పలేం. ఇక్కడ ద్వేషం ఉంటుంది. ప్రేమ కూడా ఉంటుంది. నేను ఓ పబ్టిక్‌ సెలబ్రిటీని. మనం కొందరితోనే ఉంటాం, వారితోనే మాట్లాడుతుంటాం. ఈ క్రమంలో కొందరికి నా తీరు నచ్చకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్‌ప్రెషన్స్‌, చేతులతో చేేస సంజ్ఞలు నచ్చి ఉండకపోవచ్చు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నేనంటే ప్రేమ ఉండి ఉంటుంది కదా. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని’ అని అన్నారు.

Updated Date - 2023-01-07T13:50:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!