Rashmika Mandanna : సమస్య ఎవరిది అయినా ముందుకొచ్చి స్పందించండి!
ABN, First Publish Date - 2023-11-28T12:38:18+05:30
నేషనల్ క్రష్ రష్మికకు (Rashmika Mandanna) సంబంధించి ఓ డీప్‌ఫేక్ వీడియో ఈ మధ్యకాలంలో ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే! తాజాగా దీనిపై ఆమె మరోసారి స్పందించారు.
నేషనల్ క్రష్ రష్మికకు (Rashmika Mandanna) సంబంధించి ఓ డీప్‌ఫేక్ వీడియో ఈ మధ్యకాలంలో ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే! తాజాగా దీనిపై ఆమె మరోసారి స్పందించారు. తాజాగా ఆమె నటించిన ‘యానిమల్’ (Animal) చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియో, ట్రోల్స్ గురించి మాట్లాడారు.
"ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. టెక్నాలజీ పెరగడం వరమో, శాపమో అర్థం కాకుండా ఉంది. అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నాకు మొదట అమితాబ్ బచ్చన్ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సపోర్ట్ గా నిలిచారు. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మనం ఏం చేయగలం అనిపించింది. అయితే దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నా. అందుకే స్పందించాను. ఈ సందర్భంగా నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే ఎవరూ కూడా నాకెందుకులే అని నిశ్శబ్దంగా ఉండొద్దు. సమస్య ఎవరిదైనా ముందుకొచ్చి స్పందించండి. అప్పుడు సమాజంలో ప్రజల మద్దతు దొరుకుతుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం. ఇలాంటి వాటికి భయపడటం కరెక్ట్ కాదు’’ అని చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా నుంచి నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్ ఉంటుంది. ఇక నటీనటులు, క్రికెటర్లపై మీమ్స్, ట్రోల్స్ సాధారణంగా వస్తుంటాయి. అలాంటి వాటిని పట్టించుకోకూడదు’ అన్నారు రష్మిక.