Rashmi Goutham: అవగాహన కల్పిద్దాం.. జర భద్రంగా ఉందాం!
ABN, First Publish Date - 2023-06-29T15:10:28+05:30
పెరుగుతున్న టెక్నాలజీతో సేఫ్‌గా జీవించడం కష్టంగా మారిందని యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Goutham) అన్నారు. నేటి సాంకేతికను అడ్డుపెట్టుకుని కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారనీ, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తన అభిమానులను కోరారు రష్మి. ఏఐ టెక్నాలజీని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ షేర్ చేసిన పోస్ట్‌ను రష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీతో సేఫ్‌గా జీవించడం కష్టంగా మారిందని యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Goutham) అన్నారు. నేటి సాంకేతికను అడ్డుపెట్టుకుని కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారనీ, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తన అభిమానులను కోరారు రష్మి. ఏఐ టెక్నాలజీని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ షేర్ చేసిన పోస్ట్‌ను రష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘‘ఈ పోస్ట్‌ను చూస్తున్న అమ్మాయిలందరూ వెంటనే సోషల్‌మీడియా ఖాతాను ప్రైవేట్ చేసుకోండి. డీపీలో మీ ఫొటో ఉంటే తీసేయండి. ఏ ఒక్కరితోనూ మీ ఫొటోలు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది దుర్మార్గులు న్యూడ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఆన్‌లైన్‌లో జర భద్రంగా ఉండండి’’ అంటూ నెటిజన్ పెట్టిన సందేశాన్ని అభిమానులతో షేర్ చేసి ఇలాంటి నేరపూరిత చర్యలపై అందరికీ అవగాహన కల్పిద్దాం అంటూ రష్మి ిపిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో మహిళలకు ఏ రకంగానూ సేఫ్టీ లేదు. టెక్నాలజీతో ఎదురవుతున్న సమస్యలతో జీవితమే కష్టంగా మారింది. ఇలాంటి వాళ్లకు (న్యూడ్ ఫొటోలు క్రియేట్ చేసేవారిని ఉద్దేశించి) చిక్కకుండా అమ్మాయిలందరినీ దాక్కోమని చెప్పేబదులు ఈ తరహా నేరాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం. కనిపించేదంతా నిజం కాదని ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పిద్దాం. కేవలం సరదా కోసం అసభ్యకరమైన వీడియోలు సర్క్యూలేట్ చేయొద్దని వివరిద్దాం’’ అని రష్మీ అన్నారు.