Rana Daggubati : నేషనల్ అవార్డులపై రానా ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-09-04T17:53:57+05:30
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు ఆనందిస్తే.. మరికొందరు నిరుత్సాహపడ్డారు. ఈసారి అవార్డుల లిస్ట్‌లో సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ ఉంటుందని భావించిన చాలామంది ఆ సినిమా లేకపోవడంతో ఎంతో మంది నిరాశపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ అవార్డులు (National Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు ఆనందిస్తే.. మరికొందరు నిరుత్సాహపడ్డారు. ఈసారి అవార్డుల లిస్ట్‌లో సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ (Jai bhim) ఉంటుందని భావించిన చాలామంది ఆ సినిమా లేకపోవడంతో ఎంతో మంది నిరాశపడ్డారు. అభిమానులు నుంచి సినీ ప్రముఖుల వరకూ దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. హీరో నాని (Nani) కూడా ‘జైభీమ్’కు జాతీయ అవార్డు రాకపోవడంతో తన హృదయం ముక్కలైందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ అవార్డులపై ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడారు. కొందరు చేసిన కామెంట్లు తీవ్ర చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే! తాజాగా దీనిపై దగ్గుబాటి రానా (Rana daggubati) స్పందించారు.
‘‘సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవు. అలా ఉండాలని రూల్ ఏమీ లేదు. అందరికీ ఓ జానర్ సినిమా నచ్చితే నాకు మరొకటి సినిమా నచ్చవచ్చు. నటుల అభిరుచులు కూడా అలానే ఉంటాయి. ‘జైభీమ్’ సినిమా కథకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ సినిమాకు అవార్డు రాలేదు. దానిపై ఎవరి అభిప్రాయం వారు తెలిపారు. అంతే కానీ కాంట్రవర్సీ చేయాలని కాదు. వాళ్లు కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కొందరు దాన్ని కాంట్రవర్సీగా మార్చారు. మా ఆర్టిస్టుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు’’ అని రానా అన్నారు.