Ahimsa Trailer: రానా తమ్ముడి మూవీ ట్రైలర్ చూశారా?
ABN, First Publish Date - 2023-01-13T13:35:50+05:30
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు (Suresh Productions) తనయుడు అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’(Ahimsa).
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు (Suresh Productions) తనయుడు అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’(Ahimsa). తేజ (Teja) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతిక (Geethika) హీరోయిన్‌గా నటించగా.. సదా ఓ కీలకపాత్రలో నటించింది. పి. కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించాడు. చాలా గ్యాప్ తర్వాత ఆర్‌పీ ఓ సినిమాకి మ్యూజిక్ సమకూర్చడం విశేషం. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించని ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఓ ధనవంతుడికి, ఓ పేదవాడికి జరిగే సంఘర్షణగా ఈ చిత్రాన్ని మలిచినట్లు ఈ ట్రైలర్‌ని చూస్తే తెలుస్తుంది. ఆ ధనవంతుడి నుంచి తన కుటుంబాన్ని, తన వాళ్లని కాపాడుకోడానికి ఓ యువకుడు.. గాంధీ మార్గాన్ని వదిలి, కృష్ణుడి మార్గాన్ని ఎంచుకోవడం గురించి చూపించారు. ఈ ట్రైలర్‌ని ఆద్యంతం ఎంతో ఆసక్తిగా మలిచారు. కొత్త నటులతో కొత్త రకమైన సినిమాలు చేస్తూ అలరించే తేజ మరోమారు తన మార్కుని ఈ ట్రైలర్‌లో చూపించాడు. ఈ మూవీ విడుదల తేదిని ఇంకా ప్రకటించలేదు.