Chiranjeevi: రామ్ చరణ్, ఉపాసనలకు విషెస్ చెప్పిన మెగాస్టార్, ఎందుకంటే...
ABN, First Publish Date - 2023-06-14T16:22:15+05:30
రామ్ చరణ్, ఉపాసనలకు ఈరోజు ఒక స్పెషల్. చాలామంది ఆ బెస్ట్ కపుల్ కి శుభాకాంక్షలు తెలిపారు, చిరంజీవి కూడా వీరిద్దరికి ప్రత్యేక అభిననందాలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంతకీ వాళ్ళిద్దరి జీవితంలో ఈరోజు అంత స్పెషల్ ఏంటబ్బా...
రామ్ చరణ్ (RamCharan), ఉపాసనలు (UPasana) ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు ఎక్కడ అడిగినా వీళ్లిద్దరి బెస్ట్ కపుల్ అని అంటున్నారు. అంతలా వీరి అన్యోన్య జీవితం, కలిసి టూర్ లకి వెళ్ళటం, ఒకరికి ఒకరు ఎల్లప్పుడూ అభినందనలు, ఆప్యాయతలు పంచుకోవటం ఇలా ఈ ఇద్దరూ బెస్ట్ కపుల్ గా చాలామందికి స్ఫూర్తిని ఇస్తున్నారు. వీళ్ళిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఈరోజు వీరి వివాహ దినోత్సవ రోజు, నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ సాంఘీక మాధ్యమాల్లో అభినందనల వెల్లువలా వస్తోంది. రామ్ చరణ్ తండ్రి, మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) కూడా ఈ ఇద్దరికీ విషెస్ చెప్పారు. ఈ సంవత్సరం స్పెషల్ ఎందుకంటే ఉపాసన త్వరలోనే ఒక మెగా బిడ్డకు జన్మనివ్వబోతోంది.
"హాయ్ చరణ్ మరియు ఉప్సీ! ఈ ప్రత్యేకమైన రోజున, మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, మీ ఇద్దరినీ చూస్తుంటే మాకు గర్వంగా వుంది, అలాగే మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు. ఈ సంవత్సరం స్పెషల్ ఎందుకంటే మీరు ఇప్పుడు పేరెంట్‌హుడ్ లోకి అడుగుపెడుతున్నారు, అందుకు మీ ఇద్దరికీ మేము శుభాకాంక్షలు చెప్తున్నాము. మీ పిల్లల పట్ల మీరు చూపించే ప్రేమ ఇతరులకు ఎంతో స్ఫూర్తి, ఆదర్శం అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఆశీస్సులు, ప్రేమతో అమ్మ, అప్ప" అని చిరంజీవి ప్రత్యేకంగా వీరిద్దరికీ శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేశారు.